కరెంటు తీగలను స్తంభాల మధ్య వదులుగా బిగిస్తారెందుకు...?

ఇందుకు సంబంధించి చాలామందిలో డౌట్ ఉంటుంది. అయితే, స్తంభాల మధ్య కరెంటు తీగలను కాస్త వదులుగా...Why electric cables are left loose between poles?

Update: 2022-11-30 04:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇందుకు సంబంధించి చాలామందిలో డౌట్ ఉంటుంది. అయితే, స్తంభాల మధ్య కరెంటు తీగలను కాస్త వదులుగా ఏర్పాటు చేస్తారు. ఈ తీగలు అల్యూమినియం అనే లోహంతో తయారు చేస్తారు. లోహాలన్నీ ఉష్ణోగ్రత పెరిగితే వ్యాకోచం చెంది పొడవు, మందం పెరగడం.. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు సంకోచించి బిగుసుకుపోవడం జరుగుతుంది. తీగలను స్తంభాల మధ్య బిగించి గట్టిగా కడితే... శీతాకాలంలో ఆ తీగలు సంకోచించుకుని తెగిపోయే ప్రమాదముంది. అందుకే కాస్త వదులుగా కడతారు. దీని వల్ల కరెంటు తీగలు శీతాకాలంలో, వేసవికాలంలో వేలాడుతూ కనిపిస్తాయి. 


Similar News