ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంట్ భవనం
భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ అని అభివర్ణించారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ అని అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పోగుపడిన అనుభవం ద్వారా రూపుదిద్దుకున్న ఒక వ్యవస్థ నిజమైన ప్రేరణ మన పార్లమెంటు యొక్క కొత్త భవనం కొత్త పార్లమెంటు సభ నిర్మాణం కొత్త మరియు పాత సహజీవనానికి ఒక ఉదాహరణ. ఇది సమయం మరియు అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి రుగ్వేదంలో ప్రజాస్వామ్యం యొక్క ఆలోచన జ్ఞానం, అంటే సామూహిక స్పృహ.
ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తారు. స్వాతంత్య్రానంతరం పాత పార్లమెంటు సభ భారతదేశానికి దిశానిర్దేశం ప్రస్తుత భవనం, స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న యొక్క ప్రతి హెచ్చు తగ్గులు, ప్రతి సవాలు, ఆశలు, ఆకాంక్షలు సాధించిన మన విజయానికి చిహ్నంగా మారుతోంది. ఈ భవనంలో తయారైన ప్రతి చట్టం, ఈ చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ సభలో చెప్పబడిన అనేక మర్మమైన విషయాలు అన్నీ మన ప్రజాస్వామ్య వారసత్వానికి సమానం. మన ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్య ఉద్యమంలో మరియు తరువాత స్వతంత్ర భారతదేశం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పడింది.
ఈ పార్లమెంటు సభ లోనే మన రాజ్యాంగం ఏర్పడింది. మన ప్రజాస్వామ్య వారసత్వానికి సమానం. ఈ భవనం ఇప్పుడు సుమారు 100 సంవత్సరాలు. పార్లమెంటు యొక్క ఈ భవనం ఇప్పుడు విశ్రాంతి కోరుతోంది న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనానికి సర్ ఎడ్విన్ ల్యుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ ఆర్కిటెక్ట్‌లుగా (రూపశిల్పి) పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని (గుండని నిర్మాణం) ల్యూటియన్స్ వాస్తు శైలిగా పేర్కొంటారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం) వందేళ్ల నాటిది. అయితే ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్‌లోని మిటోలిలో గల ‘చౌసత్ యోగిని ఆలయం’ ఆధారంగా చేసుకుని నిర్మించారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.
ప్రపంచం విశిష్ట కట్టడాల్లో ఒకటి
న్యూఢిల్లీ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్టస్ సర్ ఎడ్విన్ లుటియెన్స్, హెర్బర్ట్ బేకర్ బ్రిటిష్ ఇండియా కోసం ఈ భవన రూపకల్పన చేశారు. 1912-13లో పార్లమెంట్ భవనం డిజైన్ రూపొందించగా నిర్మాణ పనులను 1921లో ప్రారంభించారు. ఆరేళ్ల తర్వాత.. 1927లో ఆ భవన నిర్మాణం పూర్తి అయ్యింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. వృత్తాకారంలో నిర్మించిన ఈ భవనం 170 మీటర్లు (560 అడుగులు) వ్యాసం, 2.4 హెక్టార్ల (6 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది. భవనాన్ని 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఆరేళ్లు పట్టింది. రూ.83 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు.1927 జనవరి 17న నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
వందేళ్లవుతున్నా పార్లమెంట్ భవనం చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. జనపథ్ రోడ్‌లో రాష్ట్రపతి భవన్‌కు దగ్గరలో ఉన్న భారత పార్లమెంట్ భవనం ప్రపంచంలోని విశిష్ట కట్టడాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ భవనాన్నే కొనసాగిస్తూ వచ్చాం. ఇందులో సెంట్రల్ హాలు, లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీలతో పాటు పార్లమెంట్ వ్యవహారాల కార్యాలయాలు, కమిటీలు, వివిధ పార్టీలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. పార్లమెంట్‌లో మొత్తం 788 సభ్యులు (245 రాజ్యసభ, 543 లోక్‌సభ) కూర్చునే అవకాశం ఉంది.
పాత పార్లమెంట్ విశేషాలు
•ప్రస్తుత పార్లమెంట్. భవనం వ్యాసం 560 అడుగులు.
•మొదటి అంతస్తులోని వరండాను 27 అడుగులున్న 144 సున్నపురాతి స్తంభాలతో నిర్మించారు.
•వృత్తాకారంలోని అతిపెద్ద సెంట్రల్ హాల్ ఈ భవనం ప్రత్యేకత. సెంట్రల్‌హాల్‌కు 3 వైపులా లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉండగా, మధ్యమధ్యలో తోటలున్నాయి.
•స్వదేశీ మెటీరియల్, భారత కార్మికులతో నిర్మించిన ఈ భవనం భారత సంస్కృతికి నిదర్శనం.
•చారిత్రక చర్చలు, ముఖ్యమైన చట్టాలు, అత్యంత శక్తివంతమైన భారత ప్రజాస్వామ్యానికి ఈ భవనం సాక్షిగా నిలిచింది.
•బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోనే జరిగింది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి నాటి భారత ప్రధాని నెహ్రూ ఈ భవనం నుంచే ప్రసంగించారు.
•భారత రాజ్యాంగాన్ని కూడా ఈ సెంట్రల్ హాల్‌లోనే రూపొందించారు. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది కూడా ఈ భవనంలోనే.
•భారత రాజ్యాంగ సభ కూడా ఇదే భవనంలో 1946 డిసెంబర్ 9 నుంచి 1950 జనవరి 24 వరకు కొనసాగింది.
•సుప్రీంకోర్టును 1950లో ఏర్పాటు చేయగా, ఆ ఏడాది జనవరి 28 నుంచి పార్లమెంటు లైబ్రరీ హాల్‌లోనే కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత భవనం నిర్మించే (1958) వరకు ఈ హాల్‌లోనే కొనసాగింది.
•బ్రిటిష్ పాలకుల కళ్లు తెరిపించడానికి భగత్ సింగ్ బాంబులు విసిరింది కూడా ఇక్కడే.
•2001లో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఈ భవనంపై దాడికి పాల్పడగా 9 మంది మరణించారు.
శక్తివంతమైన చరిత్రతో పాటు వాస్తవికతను అంగీకరించడం కూడా అంతే ముఖ్యం. కొత్త భవనం స్వావలంబన కలిగిన భారతదేశం యొక్క సృష్టిని చూస్తుంది. ప్రజాస్వామ్యం అనేది జీవిత మంత్రం, జీవిత మూలకం మరియు క్రమ వ్యవస్థ.మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలు , ప్రక్రియలు నూతనత్వాన్ని సంతరించుకోవాలి.
నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు
•సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా నిర్మిస్తున్నారు. కొత్తగా త్రిభుజాకారంలోని పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10, 2020న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
•ఈ కొత్త భవనాన్ని ధోల్‌పూర్ మైన్స్ (మధ్య భారత్)లో లభిస్తున్న ఎర్ర ఇసుక రాయితో నిర్మిస్తున్నారు.
•ప్రధాన భవనం దీని పైభాగంలో అశోకుని చక్రాన్ని పోలిన 4 సింహాల లాగా ఒక కాలచక్రాన్ని నిర్మించారు. ఈ కాల చక్రం 24 గంటల సమయాన్ని, 365 రోజులను సూచిస్తుంది.
•లోక్‌సభ భవనం దీని సీటింగ్ కెపాసిటీ 888. దీనిలో జాతీయ పక్షి నెమలిని థీమ్‌గా డిజైన్ చేశారు.
•రాజ్యసభ భవనం దీని సీటింగ్ కెపాసిటీ 384. దీనిలో జాతీయ పుష్పం తామర థీమ్‌గా డిజైన్ చేశారు
•సెంట్రల్ లాంజ్ దీనిలో జాతీయ వృక్షం మర్రిచెట్టును థీమ్‌గా డిజైన్ చేచేశారు .
•సెంట్రల్ కాన్‌స్టిట్యూషనల్ హాల్ ఇది గత చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.
భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు
సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తి అయ్యేలా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగనుంది. త్రికోణాకారంలో ఈ భవనం నిర్మాణం జరిగింది. ఇక ఈ నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతలను గమనిస్తే 64,500 చదరపు మీటర్ల పరిధిలో భూకంపాలు,ఇతర ప్రకృతి విప్పత్తులు తట్టుకునేలా ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.. ఈ నిర్మాణానికి సుమారు 971 కోట్లు ఖర్చు అయింది . ఈ ప్రతిష్టాత్మకమైన నిర్మాణాన్ని నిర్మాణరంగంలో దిగ్గజ సంస్థ అయిన టాటా గ్రూప్ చేపట్టింది. నూతనంగా నిర్మించబోతున్న ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ఒకేసారి జరిగితే సుమారు 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లను ఏర్పాటు చేశారు. 2024 నాటికి ఎంపీల అందరికీ అందుబాటులో ఉండేలా పార్లమెంట్ భవనంలో కార్యాలయాలను కూడా నిర్మించారు.
ఇలా అనేక హంగులతో నూతన పార్లమెంట్ భవనం రూపు దిద్దుకుంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి; 2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలు; 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లుగా నిర్ణయించారు. ఈ భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మించారు. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి. ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్‌ప్లేస్ సదుపాయాలు ఉంటాయి. ఒక భాష నుండి మరొక భాషకు అనువదించడానికి డిజిటల్ సదుపాయాలు ఉంటాయి. ప్రోగ్రామబుల్ మైక్రోపోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి.
మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మించారు . దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. సాంస్కృతిక వైవిధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మనమందరం పార్లమెంటు సభ ఉనికికి ఆధారం అయిన ప్రజాస్వామ్యాన్ని గుర్తుంచుకోవాలి. పైగా ఆశావాదాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత ఉంది. పార్లమెంటుకు వచ్చే ప్రతి ప్రజా ప్రతినిధికీ జవాబుదారీతనం ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిర్ణయాలు ప్రతి ఒక్కటి దేశ స్ఫూర్తితో తీసుకోవాలి. మన ప్రతి నిర్ణయాలలో జాతీయ ఆసక్తి ప్రబలంగా ఉండాలి. జాతీయ తీర్మానాల సాధనకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం చాలా ముఖ్యం.
శ్రీధర్ వాడవల్లి
9989855445