ఎన్నికలు నిలిచినా.. పనులు ఆగలేదు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సశేషంగా మిగిలిన కార్యక్రమాలను ఆరు వారాల తరువాత చేపడతామని ప్రకటించింది. ఏకగ్రీవాలు చెల్లుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిందే కానీ దానికి సంబంధించిన ధృవపత్రాలు అందజేయలేదు. ప్రస్తుతం ఏపీలో జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాల్లో కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి. వీటికి ఇప్పుడు ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్ల స్థలాల పట్టాల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సశేషంగా మిగిలిన కార్యక్రమాలను ఆరు వారాల తరువాత చేపడతామని ప్రకటించింది. ఏకగ్రీవాలు చెల్లుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిందే కానీ దానికి సంబంధించిన ధృవపత్రాలు అందజేయలేదు.
ప్రస్తుతం ఏపీలో జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాల్లో కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి. వీటికి ఇప్పుడు ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్ల స్థలాల పట్టాల పంపణీ చేస్తున్నారు. కోడ్ అమలులో ఉండగా పట్టాల పంపిణీ ఎలా జరుగుతోందని, టీడీపీ మద్దతు దారులు ప్రశ్నిస్తుండడంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పసుపు కుంకుమ నిధులు ఎలా పంచారో అలాగే అంటూ సమాధానమిస్తున్నారు.
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరుగుతోంది. పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలపై శిక్షణా తరగతులు మాత్రం నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వాహించాలంటుంటే.. ఈసీ మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. అయితే ఎన్నికలకు సంబంధించిన పనులు మాత్రం ఆగడం లేదు.
Tags: local body elections, state election commission, sec, ec