24 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 24 గంటల్లోనే కనీసం ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు అధికారులు వెల్లడించారు. షోపియన్, అవంతిపొరా జిల్లాల్లో భద్రతా దళాలు గురువారం ప్రారంభించిన రెండు ఆపరేషన్‌లలో వీరు చనిపోయినట్టు తెలిపారు. షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కాగా, అవంతిపొరా జిల్లాలోని పాంపొర్ ఏరియాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మసీదులో దాక్కున్న ఇద్దరు సహా ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టామని డిఫెన్స్ ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియా వెల్లడించారు. మసీదు […]
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 24 గంటల్లోనే కనీసం ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు అధికారులు వెల్లడించారు. షోపియన్, అవంతిపొరా జిల్లాల్లో భద్రతా దళాలు గురువారం ప్రారంభించిన రెండు ఆపరేషన్‌లలో వీరు చనిపోయినట్టు తెలిపారు. షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కాగా, అవంతిపొరా జిల్లాలోని పాంపొర్ ఏరియాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మసీదులో దాక్కున్న ఇద్దరు సహా ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టామని డిఫెన్స్ ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియా వెల్లడించారు. మసీదు పవిత్రతను కాపాడుతూనే అందులో దాక్కున్న ఇద్దరు ముష్కరులను హతం చేశామని తెలిపారు. కాల్పులు, పేలుడు పదార్థాలను వినియోగించుకుండానే టియర్ స్మోక్ షెల్స్ ద్వారా మసీదులో దాగిన ఉగ్రవాదుల కథ ముగించామని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వివరించారు.