మధ్యప్రదేశ్‌లో 8 మంది వలస కూలీలు దుర్మరణం
భోపాల్: లాక్‌డౌన్ వలస జీవుల పాలిట మృత్యువులా దాపురించింది. పొట్టచేత పట్టుకుని వెళ్లిన వారు స్వస్థలాలకు చేరేలోపే ప్రమాదాల బారిన పడి కానరాని లోకాలకు చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది వలస కూలీలు చనిపోగా, మరో 29 మంది గాయాల పాలయ్యారు. సాగర్, గుణా, బార్వాణి జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస కూలీలతో వెళ్తున్న ట్రక్ మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాల్లో […]
భోపాల్: లాక్‌డౌన్ వలస జీవుల పాలిట మృత్యువులా దాపురించింది. పొట్టచేత పట్టుకుని వెళ్లిన వారు స్వస్థలాలకు చేరేలోపే ప్రమాదాల బారిన పడి కానరాని లోకాలకు చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది వలస కూలీలు చనిపోగా, మరో 29 మంది గాయాల పాలయ్యారు. సాగర్, గుణా, బార్వాణి జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస కూలీలతో వెళ్తున్న ట్రక్ మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాల్లో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో నలుగురు మహిళలు సహా ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సాగర్-కాన్పూర్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎస్పీ ప్రవీణ్ భురియా తెలిపారు. కాగా, యూపీలోని ప్రతాప్‌గడ్ నుంచి ముంబయిలోని ధారావికి ఓ వలస కూలీ టెంపోలో బయల్దేరాడు. అయితే, ఈ టెంపో గుణా జిల్లాలో బోల్తా పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ముంబయి నుంచి యూపీకి వెళ్తున్న ఓ ట్రక్‌ను మరో వాహనం ఢీకొనడంతో.. ట్రక్‌లో ప్రయాణిస్తున్న వలస కూలీలలో ఒకరు మరణించారు.