చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం వస్తుంది-ఈటల
దిశ, హైదరాబాద్: చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం వస్తుంది, అలాంటి దగ్గర మానవత్వం ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది, కానీ ఆత్మ గౌరవం కోల్పోదన్నారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్‌లో నాయిబ్రాహ్మణ విద్యార్థి సంఘం ఐదవ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు . విద్యార్థి నేతగా పీడీఎస్‌యూలో పనిచేసిన రోజుల్లో పరిషత్ హాల్‌లో వందల మీటింగ్స్ పెట్టామని, అర్ధరాత్రి దాకా సమావేశాలు […]
దిశ, హైదరాబాద్: చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం వస్తుంది, అలాంటి దగ్గర మానవత్వం ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది, కానీ ఆత్మ గౌరవం కోల్పోదన్నారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్‌లో నాయిబ్రాహ్మణ విద్యార్థి సంఘం ఐదవ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు . విద్యార్థి నేతగా పీడీఎస్‌యూలో పనిచేసిన రోజుల్లో పరిషత్ హాల్‌లో వందల మీటింగ్స్ పెట్టామని, అర్ధరాత్రి దాకా సమావేశాలు పెట్టుకొని యూనివర్సిటీ దాకా నడుచుకుంటు పోయేవారమని గుర్తు చేసుకున్నారు .
సారస్వత పరిషత్ హాల్‌తో తనకు చాలా అనుబంధం ఉందని తెలిపారు. తెలివికి, జ్ఞానానికి కులంతో సంబంధం లేదని, నైపుణ్యం ఒక్కరి సొంతం కాదని చెప్పారు. సంఘాలు సామాన్యుడికి అవసరమని మంత్రి సూచించారు. సంఘం లేకుంటే చైతన్యం లేదు, చైతన్యం లేకుంటే సమాజం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని అన్నారు. 85 శాతం మంది వారే ఉన్నారనీ… వారి చైతన్యం కోసం శ్రమించేవారికి తన మద్దతు ఉంటుందని ఈటల తెలిపారు.