త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తాం: ఈటల

దిశ,వెబ్‌డెస్క్: ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ బాగుందని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్య శ్రీతో 80 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్‌లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ది అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ అమలుకు త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. మెడికల్ సీట్లలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని వెల్లడించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఇప్పటి […]

Update: 2020-12-31 02:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ బాగుందని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్య శ్రీతో 80 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్‌లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ది అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ అమలుకు త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. మెడికల్ సీట్లలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని వెల్లడించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా పంపిణీకి సిద్దంగా ఉన్నామని చెప్పారు.

Tags:    

Similar News