కలెక్టర్​ నివేదికలో తప్పు

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల రాజేందర్​భూ వ్యవహారంలో మెదక్​జిల్లా కలెక్టర్​ ఇచ్చిన నివేదికలో పెద్ద తప్పు దొర్లింది. సీఎస్‌కు ఇచ్చిన నివేదికలోనే తప్పు ఉండటంతో హడావుడి నివేదికను తయారు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి తయారు చేసిన నివేదికలో బాధితుల వాంగ్మూలం వివరించిన కలెక్టర్​ హరీష్… కబ్జాదారులుగా సూచించిన వారి వరుసలను మార్చేశారు. అసైన్డ్​ల్యాండ్‌ను కబ్జా చేయడాన్ని వెల్లడించిన కలెక్టర్… జమునా హాచరీస్ జమునా భర్త నితిన్​రెడ్డి అని సూచించారు. […]

Update: 2021-05-02 08:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల రాజేందర్​భూ వ్యవహారంలో మెదక్​జిల్లా కలెక్టర్​ ఇచ్చిన నివేదికలో పెద్ద తప్పు దొర్లింది. సీఎస్‌కు ఇచ్చిన నివేదికలోనే తప్పు ఉండటంతో హడావుడి నివేదికను తయారు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి తయారు చేసిన నివేదికలో బాధితుల వాంగ్మూలం వివరించిన కలెక్టర్​ హరీష్… కబ్జాదారులుగా సూచించిన వారి వరుసలను మార్చేశారు.

అసైన్డ్​ల్యాండ్‌ను కబ్జా చేయడాన్ని వెల్లడించిన కలెక్టర్… జమునా హాచరీస్ జమునా భర్త నితిన్​రెడ్డి అని సూచించారు. వాస్తవంగా ఈటల రాజేందర్ ​సతీమణి జమునగా సూచించాల్సి ఉంది. కాగా, నితిన్​రెడ్డి పేరు ఎక్కడా లేదు. నితిన్​రెడ్డి మంత్రి ఈటల రాజేందర్​– జమునారెడ్డిల కుమారుడు. కానీ జమున భర్తగా నితిన్​రెడ్డిని సూచించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఇంత భారీ తప్పు దొర్లడంపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి కలెక్టర్​ నివేదికలో తల్లిని తప్పుగా చూపించి చరిత్రకెక్కారు.

Tags:    

Similar News