గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రేపు(మంగళవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గులాబ్ తుఫాన్ కల్లోలం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బుధవారం మళ్లీ యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ కల్లోలం సృష్టిస్తోంది. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రేపు(మంగళవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గులాబ్ తుఫాన్ కల్లోలం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బుధవారం మళ్లీ యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకుంటాయని స్పష్టం చేశారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి జన జీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.