డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో బీఈడీ ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి బీఈడీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం (ఓడీఎల్)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2023-04-22 13:12 GMT

దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని డా.బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి బీఈడీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం (ఓడీఎల్)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (బీఈడీ ఓడీఎల్) 2022- 23:

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్ సర్వీస్ టీచర్లు లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి.

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

వయసు: జులై 1, 2022 నాటికి 21 ఏళ్లు పూర్తి అయి ఉండాలి (గరిష్ట వయోపరిమితి లేదు)

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 22, 2023.

ప్రవేశ పరీక్ష: జూన్ 6, 2023.

వెబ్‌సైట్: https://myapplication.in/BRAOU

Tags:    

Similar News