విద్యార్థులకు అలర్ట్.. KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ.. ఎప్పటి నుంచంటే?
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ పై ప్రభుత్వం(AP Government) కీలక ప్రకటన చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ పై ప్రభుత్వం(AP Government) కీలక ప్రకటన చేసింది. KGBVల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతులలో ప్రవేశాలకు ఈ నెల(మార్చి) 22వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా SPD శ్రీనివాసరావు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని 352 KGBVల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7, 8, 9, 12 తరగతుల్లో కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. కేజీబీవీలో ఎంట్రన్స్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు(Application) చేసుకునేందుకు వచ్చే నెల(ఏప్రిల్) 11 చివరి తేదీ అని పేర్కొన్నారు.
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనారిటీ, BPL పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్స్‌కి అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss.in ను సందర్శించండి. కేజీబీవీ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల(Students)కు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 70751-59996, 70750-39990 నెంబర్లకు సంప్రదించండి.