Army Public Schools: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..వివరాలు ఇవే..

టీచర్ ఉద్యోగాల(Teacher Jobs) కోసం ప్రిపేర్ అయితున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-16 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ ఉద్యోగాల(Teacher Jobs) కోసం ప్రిపేర్ అయితున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల(Army Public Schools)లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ పీజీటీ(PGT), టీజీటీ(TGT), పీఆర్టీ(PRT) పోస్టులను రిక్రూట్ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు www.awesindia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 అక్టోబర్ 2024. నవంబర్ 23, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 10న ఫలితాలను ప్రకటిస్తారు.

పోస్టుల వివరాలు:

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT)

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT)

ప్రైమరీ టీచర్(PRT)

విద్యార్హత:

పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉతీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 01ఏప్రిల్ 2024 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్, ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 385 ఫీజు చెల్లించాలి. 


Similar News