ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2023
వ్యాయామ విద్యలో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీఈసెట్) - 2023 నోటిఫికేషన్ ను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది
దిశ, ఎడ్యుకేషన్: వ్యాయామ విద్యలో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీఈసెట్) - 2023 నోటిఫికేషన్ ను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దీనిని నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంట్రన్స్ వివరాలు:
ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీఈసెట్ - 2023)
అర్హత: బీపీఈడీ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్ ఉండాలి.
వయసు: బీపీఈడీ వారికి జులై 1, 2023 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
డీపీఈడీ కోర్సు వారికి జులై 1, 2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
ఎగ్జామ్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 900 (బీసీలకు రూ. 800, ఎస్సీ/ఎస్టీలకు రూ. 700)
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 23 నుంచి మే 10 వరకు. (లేటు ఫీజుతో మే 17 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది)
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్: మే 27, 2023.
క్రీడల పోటీల నిర్వహణ: మే 31, 2023.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in