ఇంటర్ విద్యార్థులకు పాక్షిక తరగతులు..!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పటికే 9, 10 ఇంటర్‌ విద్యార్ధులకు పాక్షికంగా తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఉన్నత విద్యా తరగతులు మాత్రం నవంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 50 శాతం మంది ఉపాధ్యాయులనే […]

Update: 2020-09-28 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పటికే 9, 10 ఇంటర్‌ విద్యార్ధులకు పాక్షికంగా తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

ఉన్నత విద్యా తరగతులు మాత్రం నవంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 50 శాతం మంది ఉపాధ్యాయులనే హాజరు కావాలని ఆదేశించినట్లు పేరొన్నారు. లెక్చరర్స్ జీతాల విషయంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల మేరకు నడుచుకుంటామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

Tags:    

Similar News