గిరిజన టీచర్‌పై లైంగిక దాడి.. నిందితుడికి అండగా విద్యాశాఖ..?
దిశ, ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లిలో గిరిజన ఉపాధ్యాయురాలిపై సహోద్యోగి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టర్ స్పందించే వరకు కూడా విద్యాశాఖ స్పందించక పోవడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసి పది రోజులు గడిచినా స్థానిక […]
దిశ, ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లిలో గిరిజన ఉపాధ్యాయురాలిపై సహోద్యోగి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టర్ స్పందించే వరకు కూడా విద్యాశాఖ స్పందించక పోవడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గిరిజన మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసి పది రోజులు గడిచినా స్థానిక విద్యాశాఖ అధికారి ఎలాంటి విచారణ జరిపించకపోవడం బాధాకరం అన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం నిందితుడిని వెనకేసుకొచ్చేందుకు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల సహాయంతో జిల్లా కలెక్టర్‌ను కలిసిన తర్వాతే నిందితుడిపై చర్యలు తీసుకున్నారని వాపోయారు. జిల్లా విద్యాశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగేదన్నారు. బాధితురాలికి అండగా నిలిచిన కలెక్టర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.