ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ..లోకేష్ యువగళం..

ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ..లోకేష్ యువగళం...Yuvagalam Padayatra: Nara Lokesh interacts with all types of pepole in villages

Update: 2023-02-01 19:00 GMT

నాలుగేళ్లుగా ఉన్మాద పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు తమ గోడు వినిపించే అవకాశం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా దక్కింది. అన్ని వర్గాల గుండె చప్పుడు లోకేష్ శ్రద్దగా వింటున్నారు. అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో మాట్లాడుతున్నారు. తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. జగన్ రెడ్డి దుష్పరిపాలన కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను కులాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్తూ ఎలా విభజన చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి రైతులు, యువత, మహిళలు, కార్మికులు, సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని పాలకులు మనకు అవసరమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. జగన్ రెడ్డి దుష్పరిపాలన కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. నాలుగేళ్లుగా ఉన్మాద పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు తమ గోడు వినిపించే అవకాశం లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా దక్కింది. అన్ని వర్గాల గుండె చప్పుడు లోకేష్ శ్రద్దగా వింటున్నారు. అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో మాట్లాడుతున్నారు లోకేష్. పల్లె,పల్లెలో గుండె చెదిరిన రైతుల వెన్ను తడుతూ, యువత, బడుగుల బాగుకు భరోసా ఇస్తూ, ఆడపడుచుల భద్రతకు అండగా ఉంటానంటూ, బతుకు భారమైన సామాన్యుడి కడగండ్లు కళ్లారా చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి జగన్‌ రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని, మోటర్లకు మీటర్లు బిగిస్తే పీకిపారేయాలని పిలుపు ఇస్తున్నారు, పన్నులు విపరీతంగా పెంచేసి అమ్మఒడి ఇస్తున్నారని. అనేక సాకులతో అమ్మఒడికి కోతలు పెట్టారని, మద్యపాన నిషేధం విధిస్తానని, అధికారంలోకి వచ్చి మద్యంపై వచ్చే ఆదాయాన్ని 20 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని, విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని తయారు చేసి జగన్‌రెడ్డి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని, 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని మోసం చేశాడని, తాము అధికారంలోకి వస్తే ప్రజలపై వేసిన పన్నుల భారం, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని హామీ ఇస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు జగన్‌ రెడ్డి హయాంలోనే పెరిగాయని, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలంటే జగన్‌ పోవాలంటూ నినదిస్తున్నారు.

కారాగారాల్లో ఉండాల్సిన వారిని..

కానీ ప్రతి విషయానికి వక్రభాష్యాలు ఉండనే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అసమర్థ, అసంబద్ధ విధానాలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభం, రైతుల బాధలు, విద్యుత్తు మోటార్లకు మీటర్లు, పెంచిన విద్యుత్తు, బస్సు చార్జీలు, పారిశ్రామిక రంగం పతనం, పరిశ్రమలు వెళ్లిపోవడం, నిరుద్యోగం, నిత్యావసర ధరలు, మహిళలకు భద్రత కరువు, ఖనిజ సంపద దోపిడీ, ఇసుక కొరత, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు, ప్రజలపై మోపిన పన్నుల భారం, సాగునీరు, తాగునీరు, ధ్వంసం అయిన రహదారులు వంటి అనేక అంశాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు నారా లోకేష్. తమకోసం వస్తున్న లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన యాత్రకు వస్తున్న ఆదరణ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఆయన ప్రసంగాలు శ్రద్దగా వింటున్నారు. తమ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ దృష్టికి తెస్తున్నారు ప్రజలు. రాజకీయాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విశ్వాసంతో నిలబడే వ్యక్తే ప్రజా జీవితంలో విజయం సాధిస్తారు. కృషి లేకుండా ఎవ్వరు విజయవంతం కాలేరు. ఎవరి విజయానికైనా వ్యూహం, అధ్యయనం, నిరంతర శ్రమ అవసరం. సమర్థులు, దృఢ నిర్ణయాలు తీసుకొనేవారు, ప్రజా దృక్పథం, దూరదృష్టి ఉన్న వారు దేశానికి, రాష్ట్రానికి అవసరం. నేడు అటువంటి నాయకుడు లేకే పాలన గతితప్పి రాష్ట్రం సర్వనాశనం అయి అధోగతి పాలు అయింది. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వారు ప్రజల జీవితాలను కబళించారు.

రాష్ట్ర పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచించండి..

ముఖ్యంగా యువత క్రియాశీలంగా వ్యవహరించవలసిన సమయమిది. జన జీవితాలను, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన సమస్త సమస్యలకు సమర్ధ పాలనే శరణ్యం. చీకట్లు కమ్మిన సీమాంధ్రలో వెలుగులు నింపే కాంతి పుంజం యువతే. కావున యువత విజ్ఞతే విజేతగా నిలవాలి. యువతీ యువకులు నిరాశతో నిరర్ధకంగా సమయాన్ని వృధా చేయకండి. యువగళంతో కదలండి. యువగళం అడుగులో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కార్యోన్ముఖులు కండి. తీవ్రమైన నిర్భంధం, అరాచకం, అవినీతి, అప్పులు, అస్తవ్యస్తమైన ఆర్ధిక వ్యవస్థ, అడుగట్టిన అభివృద్ధి, కలవర పెడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, భద్రత లేని మహిళలు, ఉపాధి లేని కార్మికులు, ప్రాంతీయ వైషమ్యాలు, అధిక ధరలు, భారమైన పన్నులతో దుర్భరమైన ప్రజా జీవనం వంటి సమస్యలు సవాల్ విసురుతున్నాయి. వీటిని ఎదుర్కొని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు యువతీ యువకులు ఒక ధ్యేయంతో ముందుకు కదలాలి. నవ్యాంధ్ర నలుమూలల ప్రజల్ని సమాయత్తం చేయండి. వినిపిస్తున్న సమస్యల ధ్వని వినండి. ఇంకా నిశ్చేష్టులై నిస్సారంగా జీవితం కొనసాగించకండి. ప్రజాధనం దోపిడీకి రాజకీయాన్ని అడ్డదారిగా ఎంచుకొని పంచభూతాలను దోపిడీ చేసి ఆంధ్రప్రదేశ్‌ని అస్తిపంజరం చేసారు. రాష్ట్ర ప్రజలు అజ్ఞానానికి, అసమర్థులకు, అవినీతి పరులకు, మూర్ఖులకు పట్టం కట్టారు. నేడు తిరిగి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.

రాష్ట్రంలో ప్రతి సగటు మనిషి గుండెమీద చేయి వేసుకుని తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ పిల్లలకు సరైన చదువు చెప్పించగలుగుతున్నామా ప్రజలకు సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నదా రవాణా సౌకర్యాలు సరిగా ఉన్నాయా యువతకి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయా సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నామా అని రైతులూ, తమ ఉపాధి దొరుకుతున్నదా అని కార్మికులు, రాష్ట్రంలో తమకు భద్రత ఉన్నదా, బయటికి వెళితే క్షేమంగా ఇంటికి తిరిగి రాగలమా అని మహిళలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ప్రజలను కులాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్తూ ఎలా విభజన చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి రైతులు, యువత, మహిళలు, కార్మికులు, సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని పాలకులు మనకు అవసరమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది. జరుగుతున్న అరాచకం, అవినీతి, దోపిడీ, అన్యాయాలపై మనకెందుకులే అనుకొంటే ఆ తర్వాత మన గురించి గొంతెత్తే వారే ఉండరు. ప్రజల తరపున గళం ఎత్తేవారికి అండగా నిలవాలి. ఓర్చుకుని, సహనంతో ప్రశ్నించకుండా ఉంటే అది మరింత వినాశనానికి దారితీస్తుంది.

రాష్ట్రంలో ఫాసిస్టు రాజ్యం..

ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై జగన్ ప్రభుత్వం కక్షగట్టింది. అందుకే సెంటు భూమి విషయంలో అక్రమ కేసులు పెట్టించి అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని వేధిస్తున్నది. అలాగే లోకేష్ పాదయాత్రపై వెటకారపు వ్యాఖ్యలు చేస్తోంది వైసీపీ. లోకేష్ పాదయాత్రతో తమ పీఠానికి బీటలు వారుతోందన్న ఆందోళన జగన్ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. అందుకే లోకేష్ పాదయాత్రపై నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జగన్ పరిపాలన హిట్లర్ పరిపాలనను తలపిస్తోంది. హిట్లర్ సైతం జర్మనీలో సమస్యలన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేసి ఆలోచనాపరుల, మేధావుల మెదళ్ళలో విషం నింపాడు ఫలితం ఏమైంది లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్‌లోకి పంపి హత్య చేయించాడు.

చరిత్ర పుటల్లో కనీవినీ ఎరగని దుర్మార్గం జరిగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక జర్మనీ పోలికలే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. తామే అసలైన ప్రజా ప్రయోజకులం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది అంతా ప్రజాద్రోహమే అని అర్థం అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్యాచరణకు పూనుకోకపోతే నష్టపోయేది ప్రజలే. కావున ప్రజలు నిజం తెలుసుకొని పరిష్కారం వెతుక్కోవాలి. అధోగతి పాలు అయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యువగళం పాదయాత్రకు మద్దతు తెలపండి.

నీరుకొండ ప్రసాద్

9849625610

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

గోటితో పోయేదాన్ని.. గొడ్డలిదాకా గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం విషయంలో జరిగిందేంటి? 


Tags:    

Similar News