India- UAE Relations: భారత్-యూఏఈ సంబంధాలు బలపడాలి

world walk: editorial on India-UAE trade relations

Update: 2022-12-13 18:45 GMT

ఈఎస్‌సీఈ కూటమికి చెందిన దేశాలు ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభా, 20 శాతం జీడీపీ కలిగి ఉన్నాయి. యూఏఈ సైతం 2023లో 'కాప్-28' యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ సదస్సు కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పరిస్థితులలో క్లీన్ టెక్ ఎనర్జీ సొల్యూషన్ కు యూఏఈ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.‌ ఈ విధంగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పలు అంతర్జాతీయ, స్థానిక సంస్థలకు, సారథ్యం, ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో సుస్థిర అభివృద్ధి సాధించాలి. ఇందులో సంభాషణలు, సహకారం , కొలాబరేషన్ అనే థీమ్ తో శాంతి, సుస్థిర అభివృద్ధి, ప్రాస్పరిటీ ఇరుదేశాల తో పాటు ఇరుగు పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలు సఖ్యత సాధించాలని కోరుకుందాం.

నాదిగా భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంబంధాలు చరిత్రపరంగా, సాంస్కృతిక పరంగా బలంగా ఉన్నాయి. హిందూ మహాసముద్రం నెట్వ్‌వర్క్ పరస్పర సహకారంతో వర్తక, వాణిజ్య, సామాజిక సంబంధాలు మెరుగుపరచడానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జి-20 అంతర్జాతీయ కూటమికి ప్రస్తుతం భారత్ సారథ్యం చేపట్టింది. 2023 సెప్టెంబర్‌ 9,10 తేదీలలో న్యూఢిల్లీలో జరననున్న జి-20 సమావేశాలకు యూఏఈ అతిథి దేశంగా హాజరవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల వర్తక, వ్యాపారాలు మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేయాలి.

వాటి ఆధారంగా ముందుకు

'కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (సీఈపీఏ)' ద్వారా ఇరుదేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి వేగవంతమైన చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా గత ఐదేండ్లుగా చమురు రహిత రంగాలలో అనగా, ఇతర రంగాల మార్కెట్‌లో సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్‌ల వ్యాపారం జరిగింది. యూఏఈ మార్కెట్ ద్వారా సుమారు 97 శాతం అవకాశాలు ఏర్పాటు చేసుకోగా, భారత్ 99 శాతం ఎగుమతులు యూఏఈకి చేయగలిగింది. సీఈపీఏ(CEPA) ద్వారా వివిధ మార్కెట్ రంగాలలో యూఏఈ మన దేశ ప్రజలకు సుమారు పది లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. సీఈపీఏ ద్వారా యూఏఈ వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి.

అమెరికా, భారత్, యూఏఈ, ఇజ్రాయెల్ ఐ2యూ2(I2U2) సభ్యదేశాలుగా ఉండుట వలన ఈ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. వివిధ రంగాలలో అమెరికా సామర్థ్యాలు, భారత్ మేధస్సు, ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా యూఏఈ తయారీ రంగంలో స్టార్టప్‌ల ద్వారా తన బలాన్ని పెంచుకోవడానికి ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో మన దేశంలో కూడా ఐ2యూ2 దేశాల ద్వారా మంచి వ్యాపార ప్లాట్‌ఫాం రూపొందిస్తున్నది. యూఏఈ మన దేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఫుడ్ పార్క్‌ల పేరిట 7 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇందులో వ్యవసాయ సాధనాలు, వేర్ హౌసింగ్, పండ్లు కూరగాయల హబ్స్ వంటివి ఉన్నాయి.

అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం

యూఏఈ ఎనర్జీ రంగంలోనూ పెట్టుబడులను విస్తరించింది. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తుంది. ముఖ్యంగా పునరుత్పత్తి ఎనర్జీ రంగంలో ఇండియాకు పూర్తి సహకారం అందించడంలో భాగంగా 450 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి శ్రీకారం చుట్టింది. ‌'నెట్ జీరో' వైపు ప్రయాణం చేయడం వల్ల కార్బన్ ఉద్గారాలకు చెక్ పెట్టవచ్చనే భావనతో యుఏఈ భారత్‌తో చేయి కలిపి ముందుకు సాగుతోంది.‌ రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, సుస్థిర ఆర్థిక అభివృద్ధి, కార్బన్ ఉద్గారాలపై, బయో వాయివులు, ఇండస్ట్రియల్ డీ కార్బనైజేషన్ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనతో ముందుకు సాగుతున్నారు. 2023 లో జరిగే 'ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA) కు భారత్ సారథ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం, భద్రత, పొరుగు దేశాలతో ఉన్న వ్యాపార అభివృద్ధి వంటి అంశాలతో భారత్ ముందుకు సాగాలి.‌ మరో సమావేశం షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కూటమికి సైతం వచ్చే 2023 జూన్‌లో భారత్ సారథ్యం వహించనున్న నేపథ్యంలోనూ డైలాగ్ పార్ట్‌నర్ గా యుఏఈ ఉన్నది.‌ కావున ఈ అవకాశాన్ని ఇరుదేశాలు అందిపుచ్చుకుని పరస్పర సహకారంతో వర్తక వాణిజ్య సంబంధాలు మెరుగు పరుచుకోవాలి.

ఈఎస్‌సీఈ కూటమికి చెందిన దేశాలు ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభా, 20 శాతం జీడీపీ కలిగి ఉన్నాయి. యూఏఈ సైతం 2023లో 'కాప్-28'(COP-28) యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ సదస్సు కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పరిస్థితులలో క్లీన్ టెక్ ఎనర్జీ సొల్యూషన్ కు యూఏఈ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.‌ ఈ విధంగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పలు అంతర్జాతీయ, స్థానిక సంస్థలకు, సారథ్యం, ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో సుస్థిర అభివృద్ధి సాధించాలి. ఇందులో సంభాషణలు (conversation), సహకారం (cooperation), కొలాబరేషన్(collabaration) అనే థీమ్ తో శాంతి, సుస్థిర అభివృద్ధి, ప్రాస్పరిటీ ఇరుదేశాల తో పాటు ఇరుగు పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలు సఖ్యత సాధించాలని కోరుకుందాం.


ఐ.ప్రసాదరావు

6305682733

Read More...

Xi Jinping tour: గల్ఫ్ దేశాలతో చైనా మైత్రి దేనికోసం? 

Tags:    

Similar News