టీఆర్టీ పోస్టులు పెరిగేనా?

గత సంవత్సరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో టీఆర్టీ

Update: 2023-10-09 23:30 GMT

గత సంవత్సరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో టీఆర్టీ 13,086 ఖాళీలు భర్తీచేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో 6 సంవత్సరాలుగా ఈ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఉత్సహం కలిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్టీని కేవలం 5,089 పోస్టలకే విడుదల చేయడంతో టీఆర్టీ అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అలాగే ఉన్న ఫళంగా సిలబస్ మార్పు చేసి పరీక్షకి కేవలం 2 నెలల సమయం ఇచ్చి, పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలు చేయడం లాంటి కారణాలతో ప్రభుత్వంపై టీఆర్టీ అభ్యర్థులు మండిపడుతున్నారు. మొత్తం 13,086 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కేవలం 5089 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 33 జిల్లాల వారీగా రోస్టర్ చూస్తే దాదాపు 18 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ గణితం, సైన్స్, ఇంగ్లీష్ ఒక్క పోస్ట్ కూడా లేదు.. ఎస్జీటీలో 14 కేటగిరీలో 29 జిల్లాల్లో సున్న.. లేదా ఒకటీ.. రెండూ పోస్టులు ఉన్నాయి..ఉర్దూ మీడియంలో 500 పోస్టులు షెడ్యూల్ కులాలకు కేటాయించారు.. ఇవి మరొక సారి బ్యాక్ లాగ్ కానున్నాయి.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్, ఖాళీలు కలపాలని అభ్యర్థులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కానీ టీచర్ సంఘాలు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నారు.. టీచర్ సంఘాలు ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువతకు బాసటగా నిలబడలేదు. అనేక ఉద్యోగ పరీక్షలకు 6 నుండి 8 నెలల సమయం ఇస్తున్న ప్రభుత్వం, అసలే తక్కువ ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసి సిలబస్ మార్పు చేసి పరీక్ష 2 నెలల వ్యవధిలోనే నవంబర్ 20 నుండి నిర్వహణ చేస్తామని పేర్కొనడం పట్ల అభ్యర్థుల తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. కనీసం పరీక్షలకు 4 నెలల సమయం ఇవ్వాలనీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పరీక్షలకు 6 నుండి 8 నెలల సమయం ఇస్తూ ఇంకా గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ 10 నెలల క్రితం నోటిఫికేషన్స్ జారీ చేసి పరీక్ష తేదీలు ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ టీఆర్టీకి ఇంత హడావిడిగా పరీక్ష నిర్వహణ అది కూడా అభ్యర్థులకు పట్టులేని ఆన్ లైన్ విధానంలొ నిర్వహిస్తామనడం ఏంటి? పైగా పరీక్ష ఫీజు 2017 లో రూ. 200 ఉండగా ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. నిన్నటికి ఎన్నికల కోడ్ వచ్చేసింది.కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు టీచర్ పోస్టుల భర్తీ మూలన పడినట్లేనని అనుకోవచ్చు!

రావుల రామ్మోహన్ రెడ్డి,

రాష్ట్ర డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం

93930 59998

Tags:    

Similar News