పార్టీలు..ఈ ఆరాలు తీయవెందుకు?
Why political parties do not talk about employment
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హడావిడీ కొనసాగుతోంది. ఆయా రాజకీయ పార్టీలు మేనిఫెస్టో(హామీలు)ను వివరిస్తూ ప్రజల నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో అధికార పార్టీ నాయకులు.. పెన్షన్ వస్తుందా?, రైతు బంధు, రైతు బీమా అందుతుందా అని అడుగుతున్నారు. ప్రతిపక్ష, విపక్షాలు మాత్రం.. గెలిచాక మేము అది చేస్తాం! ఇవి ఇస్తాం అంటున్నాయి. అదే విధంగా గ్యాస్ రూ.500 కే ఇస్తామని ఓ పార్టీ, రూ.400కే అందిస్తామని కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి.
కానీ, ఒక ఇంట్లో ఎంతమంది విద్యావంతులున్నారు? ఎందరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది? రైతులు, చేనేతలు ఉన్నారా?.. వాళ్లు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అని ఎందుకు అడగడం లేదు? అసలు ఇలాంటివి ఏవైనా ఆరా తీస్తున్నారా? ప్రస్తుతం అధికారంలో ఉండి చేయలేనివి.. మళ్లీ అధికారంలోకి వచ్చాక చేస్తామనడం విడ్డూరం కాదా? అలాగే గతంలో పాలించిన పార్టీలు సమస్యలు లేకుండా పాలించిందా? అనేది ఓటరు ఆలోచించుకోవాలి. అప్పుడు చేయలేనివి ఒక్క అవకాశం ఇస్తే అన్నీ చేస్తామని మాట్లాడడం హాస్యాస్పదం!
- తలారి గణేష్
99480 26058