దోచుకునేవాళ్ల వద్ద అడుక్కోవడమా?
దేశీయ ఉత్పత్తులను ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్న దేశ, రాష్ట్ర పాలకులు, ఆయా పాలక వర్గాల ప్రతినిధులు ఇతర దేశాలకు వెళ్లి మా దేశం, మా రాష్ట్రం పెట్టుబడులకు
దేశీయ ఉత్పత్తులను ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్న దేశ, రాష్ట్ర పాలకులు, ఆయా పాలక వర్గాల ప్రతినిధులు ఇతర దేశాలకు వెళ్లి మా దేశం, మా రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం.. రండి పెట్టుబడులు పెట్టండి అని అభ్యర్థిస్తున్నారు. నిజానికి వీరు అభ్యర్థిస్తున్న దేశాలన్నీ, భారతదేశాన్ని రెండు శతాబ్దాలుగా దోచుకున్నవే. భారతదేశాన్ని దోచుకున్న దేశాల్లో బ్రిటన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలున్నాయి. మన దేశాన్ని దోచుకున్న సామ్రాజ్యవాద శక్తులనే వెళ్లి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అడగకుండా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న అనేక ఆహారోత్పత్తి సాధనాలను విస్తృతం చేసి ప్రజల్లో జనజీవన సంస్కృతి విప్లవాన్ని తీసుకురావాలని అంబేడ్కర్ చెప్పాడు. రైతు అప్పుల బాధతో ప్రకృతి వైపరీత్యాలతో పండించిన పంటకు మద్దతు ధర లేక అల్లాడి పోకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వాలు సమకూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.
భారతదేశం ఈనాడు ఆర్థిక సామాజిక దోపిడీతో అణచివేయబడుతుంది. దేశీయ ఉత్పత్తులను దేశ, రాష్ట్ర పాలకులే నిర్లక్ష్యం చేస్తున్నారని మనకు అర్థం అవుతుంది. భారతదేశంలో 40 కోట్ల మందికి ఉండటానికి జాగ లేదు. 70 కోట్ల మందికి సాగుభూమే లేదు. గ్రామీణ వ్యవ సాయం తగ్గిపోతూ వస్తుంది. నాబార్డ్ నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో 56.7 శాతం కుటుంబాలే ఇప్పుడు సాగు రంగంలో ఉన్నాయి. అందులోనూ చిన్న, సన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువ. దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాల చేతిలో ఎక్కువ భూముల్లేవు. కార్పొరేట్ సంస్థ చేతుల్లోకే ఎక్కువ భూములు పోతున్నాయి. నిజా నికి భారతదేశంలో వ్యవసాయం తగ్గిపోవడానికి కారణం పాలకుల కుటిలనీతే. కొంతమంది పాలకులు వ్యవసాయం దండగా అని ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ భారతదేశం వ్యవసాయక దేశం. ముఖ్యంగా గిరిజనులు, దళితులు ఇంకా 90% కంటే ఎక్కువ వ్యవసాయ కూలీలుగానే జీవిస్తున్నారు.
దళితుల పేదరికం రెట్టింపు
నిజానికి 1989 నుంచి దళిత గిరిజన పల్లెలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నేడూ అంతే విస్తీర్ణం లో జీవిస్తున్నారు. ఒక కుటుంబంలో ఈలోపు జీవించిన కుటుంబ సభ్యుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒంటి నిట్టాడి ఇంట్లో 5 కుటుంబాలు జీవించేవారు ఉన్నారు. ప్రతి గుడిసెల్లో 3 కుటుంబాలకు పైగా ఉన్నాయని ప్రభుత్వాలకు తెలియ డం లేదు. అవి పెను మురుగువాడలుగా మారిపోయాయి. నిజానికి భార్యభర్తలకు కూడా ప్రైవసీ లేదు. అందుకనే మొత్తం భారతదేశంలో ఈనా డు అనారోగ్యం పెరగడానికి కారణం. ఇక ఒక సెంటు భూమి కూడా ఇవ్వకూడదనే కుల వివక్ష పూరితా అగ్రకుల రాజ్యాధిపత్య భావనే..! ఒక ఇంట్లో వంద బల్బులు వెలుగుతున్నవారు ఉ న్నారు. ఒక ఇంట్లో ఒక బల్బు కూడా లేనివారు ఉన్నారు. చీకట్లో మగ్గుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, సర్వేలు చెప్తున్నాయి. దళితులను పేదరికంలోనే ఉంచాలి. వారికి భూములు పంచకూడదని, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టకూడదని. వారు అస్తిపంజరంలా జీవించాలి అని అగ్రకుల పాలకులు భావిస్తున్నారు. నిజానికి మధ్య తరగతి రైతు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితులకు నెట్టబడుతున్నాడు. మధ్య తరగతి జీవన సంక్షోభంలోకి రైతు వెళుతున్నాడు.
ఆకలి సూచీలో 105వ స్థానం
ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) పరిశీలన ప్రకారం 74.1 శాతం భారతీయులు పోషకాహారాన్ని పొందలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో దళిత గిరిజనులు ఎక్కువ. దళిత గిరిజనులకు పౌష్ఠికాహార లోపం పెరగడం వల్ల వారి పిల్లలకు రక్తలేమి పెరగడం వల్ల కడుపులు బూరలై, కాళ్లు సన్నబడి బతుకు భారమై, పిల్లలను పెంచలేని స్థితిలో వారు ఎటో వెళ్లిపోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతావని స్వయం సమృద్ధి సాధించింది. 2023-24లో 33.2 కోట్ల టన్నుల తిండిగింజల దిగుబడిని కళ్ల జూసింది. 3.89 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అలరారుతోంది. అయితే ధాన్యాలు సమృద్ధిగా పండు తున్నా ప్రభుత్వం బియ్యం 80 కోట్ల మందికి ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది. 2024 ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాల సరసన 105వ స్థానంలో నిలిచి పరువు తీసింది. పోషకాహార లేమి, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శిశు మర ణాల లెక్కల ఆధారంగా రూపొందించే ఈ సూచీ లో ఇండియా ఎందుకు ఏటా చతికిల పడు తోంది. ఐసిడీఎస్‌లో లోపాల పరిహరణ తదితరాలపై ప్రభుత్వాలు దృష్టి సారించనంత కాలం జన భారతం భవిత గిడసబారిపోతూనే ఉంటుం ది. మన ఆహార ధాన్యాలు ఓడల నిండా ఎగుమతి చేసి ప్రపంచంలో సుమారు 150 దేశాలకు కడుపునిండా మన రైతు అన్నం పెట్టగలుగుతున్నాడు. అన్నదాతను ఆదు కుంటే దేశ పురోగతి అధికమవుతుంది. జీవన సౌందర్యం ఆహారం సంపూర్ణంతోనే ఉంటుంది. అలాంటి సుఖ సంతోషాలు అందించే రైతు అప్పుల బాధతో ప్రకృతి వైపరీత్యాలతో పండించిన పంటకు మద్దతు ధర లేక అల్లాడిపోకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వాలు సమకూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.
అభివృద్ధికి అంబేడ్కర్ పంథానే మార్గం!
భారతదేశానికి ఆర్థిక సామాజిక వాణిజ్య శాస్త్రాన్ని రూపొందించిన డా॥బి.ఆర్.అంబేడ్కర్ వ్యవసాయాన్ని విస్తృతి చేయాలని, మన దేశంలో వున్న నదులను అనుసందానం చేయాలని, దేశీయ పరిశ్రమలను పెంచాలని, దేశీయ సంపదను పెం చాలని ప్రతి మనిషికి పని కల్పించాలని, ప్రజలు సోమరులైతే దేశం దారిద్య్ర దావానాలంలో దహించబడుతుందని చెప్పారు. సోమరితనం దేశానికి శత్రువు అని, పాలకులు నిరంతరం ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, బలహీనతలను నివారిస్తూ, ఉత్పత్తి రంగంలో, సాంకే తిక రంగంలో ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ ముందు కు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. మన దేశాన్ని దోచుకున్న సామ్రాజ్యవాద శక్తులనే వెళ్లి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అడగ కుండా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న అనేక ఆహారోత్పత్తి సాధనాలను విస్తృ తం చేసి ప్రజల్లో జనజీవన సంస్కృతి విప్లవాన్ని తీసుకురావాలని అంబేడ్కర్ చెప్పాడు. అంబేడ్కర్ ఆలోచనలతో ముందుకు వెళ్లినప్పుడే భారతదేశం సామా జిక ఆర్థిక సౌభాగ్యాన్ని కలిగి వుంటుందని పాలకవర్గాలు ఆయన ఆలోచనలను అధ్యయనం చేసి కుల నిర్మూలనకు, పేదరిక నిర్మూలనకు పాటు పడతారని ఆశిద్దాం.
-డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695