రిజిస్ట్రేషన్‌లో ఇంత వివక్షా?

Why discrimination in land registration?

Update: 2023-08-09 23:30 GMT

ప్రభుత్వ భూములను 59, 84,118 జీవోల ద్వారా రిజిస్ట్రేషన్‌లకు అనుమతిస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు భూమిలో ఉన్న గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు ఎందుకు చేయదు? గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇల్లీగల్‌ లే అవుట్లు అని ముద్ర వేసి రిజిస్ట్రేషన్‌లు నిలిపి వేసిన ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తెలంగాణలో ఉన్న నగరాలన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లలోనే నిర్మాణం అయినవి అని మర్చిపోరాదు. గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ నిలిపి వేయడం వలన ఫామ్ సైట్లు అన్ని గుంట, రెండు గుంటలు, మూడు గుంటలు చేసి ఎమ్మార్వో ఆఫీస్‌లలో మ్యుటేసన్, నాలా కన్వర్షన్ చేపించుకోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లలో రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.

అసలు ఉద్దేశం ఇదే!

నిజానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొందరు ఆంధ్రా బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలలో భాగస్వాములుగా ఉండి వాటి అభివృద్ధి కోసం మాత్రమే నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ రియల్టర్స్ బిజినెస్‌ను దెబ్బ తీయడం కోసమే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేసి ఆర్థికంగా దెబ్బ కొట్టడం జరిగింది. వేలాది మంది కొనుగోలు దారులు గ్రామ పంచాయతీ లే అవుట్లలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రెండున్నర సంవత్సరాలుగా ఆందోళనలో ఉన్నారు.గ్రామపంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ బంద్ చేసి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. కోకాపేటలో భూములు వేలం పాటలో 100 కోట్లకు ఎకరం అమ్ముకున్నది. ఇలా పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రైవేట్ భూములు ఉన్నచోట ప్రభుత్వ భూమి వేలం వేసి కృత్రిమ బూమ్ క్రియేట్ చేసి వారి భూములను అధిక ధరకు అమ్ముకోవడం కోసం వేసిన ఎత్తుగడ. ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్ బంద్ చేశారు. కేవలం తమ వారి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలే అభివృద్ధి చెందాలనేది అసలు ఉద్దేశం.

లేకపోతే ఎప్పుడో 1990లో గ్రామపంచాయతీ లేఅవుట్ చేసి భూమి అమ్మగా అందులో నాలుగు ప్లాట్లు మిగిలి పోతే వాటిని కూడా రిజిస్ట్రేషన్‌కు అనుమతిచక పోవడం ఏమిటి? ప్రభుత్వ ప్రైవేట్ భూములలోని నోటరీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి 84 జీఓ తెచ్చిన ప్రభుత్వం, గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయక పోవడంలో ఉద్దేశం ఏమిటి? ఇదంతా మాజీ సీఎస్ వల్లనే జరిగింది. అందుకే ప్రస్తుత స్టాంప్స్ & రిజిస్ట్రార్ ఐజీ వారిలాగా ప్రభుత్వం ఏది చెబితే దానికి తల ఊపకుండా సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకవచ్చి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించి వేలాది మంది కొనుగోలుదారుల ఆందోళన అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కోరుతోంది.

నారగొని ప్రవీణ్ కుమార్

అధ్యక్షులు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Tags:    

Similar News