Ask Dr. Bharathi:శృంగారంలో ఆందోళన ఎందుకు?

మనిషిలో అనేక రకాల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, భయం, ఉద్వేగం, ఆందోళన, కృంగుబాటు తనం, ఒత్తిడి లాంటివి శృంగార జీవితాన్ని

Update: 2024-09-15 01:30 GMT

మనిషిలో అనేక రకాల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, భయం, ఉద్వేగం, ఆందోళన, కృంగుబాటు తనం, ఒత్తిడి లాంటివి శృంగార జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా ఆందోళన అనేక శృంగార సమస్యలకు దారి తీస్తుంది. 

ఆలోచనలు, అనుమానాలు..

శృంగార సమయంలో స్త్రీలు, నా శరీరాన్ని ఎలా అంచనా వేస్తారు? నా వక్షోజాలు చిన్నగా లేదా మరీ పెద్దగా ఉన్నాయని అనుకుంటాడా? నా లైంగిక అవయ వాలు అసహ్యంగా ఉన్నాయని అనుకుంటున్నాడా...? నా జననాంగాల నుంచి వచ్చే వాసన అతనికి నచ్చదేమో? సెక్స్‌ వల్ల నొప్పి, రక్తస్రావం అవుతాయేమో? కలిసిన తర్వాత వీర్యం శరీరం బయటకు వచ్చేస్తుందేమో? నా ఒంటి మీద మచ్చలు తనకు అసహ్యాన్ని కలిగిస్తాయోమో? అని స్త్రీ అలోచిస్తే, పురుషులేమో..నాకీరోజు అంగస్తంభన వస్తుందా? వచ్చినా ఎక్కువసేపు ఉంటుందా? శీఘ్రస్ఖలనం అవుతుందేమో? నా భార్యను నేను సంతృప్తి పరచగలనా? నా అంగం చిన్నగా ఉందని ఆమె నవ్వుతుందేమో? నా బీర్జాలు చిన్నగా, వేలాడుతూ ఉన్నాయని నవ్వుతుందేమో? ఈ అక్రమ సంబంధం వల్ల నాకు ఏమైనా రోగాలు వస్తాయేమో? అని ఆలోచనల్లో ఉంటాడు. వీటిల్లో కొన్ని ఆందోళనలు ఖచ్చితంగా కొన్ని సహజమైన కారణాల వల్ల వస్తాయి. వాటిని ప్రీ & పోస్ట్‌మెరైటిల్‌ కౌన్సెలింగ్‌ (వివాహానికి ముందు, తర్వాత) ద్వారా తగ్గించవచ్చు. దంపతులిద్దరిలో శాస్త్రీయమైన విశ్లేషణ ద్వారా ఆందోళనల స్థాయిని తగ్గించవచ్చు. కానీ, కొన్ని రకాల ఆందోళనలకు హేతువు ఉండదు. మూఢనమ్మకాల వల్ల, అశాస్త్రీయ జ్ఞానం వల్ల అవి పెంపొందుతాయి. ఉదా చిన్న అంగం అని ఆందోళన పడటం. మీ ఆందోళన వల్లే శృంగారంలో అంగస్తంభన సమస్య. శీఘ్రస్ఖలనం మొదలవుతాయి.

ఆందోళనలు..చికిత్స పద్ధతి

ఆందోళన, డిప్రెషన్‌ లాంటి మానసిక స్థితిలో మెదడు కొన్ని ప్రమాదకర రసాయనాలను దేహంలో విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు కిడ్నీలపైన ఉండే అడ్రినలిన్‌ అనే గ్రంథి ద్వారా విడుదల అవుతాయి. ఈ రసాయనాలు సెక్స్‌ సమస్యలను సృష్టిస్తాయి.

పురుషుల్లో: అంగస్తంభన వచ్చే సమస్య అవకాశం ఉంటుంది. అలాగే వీర్యస్ఖలనం క్షణాల్లో అయిపోతుంది. కొన్నిసార్లు అంగప్రవేశానికి ముందే అయిపోతుంది. స్త్రీలలో: ఆందోళన వల్ల యోని కండరాలు బిగుసుకుపోయి అంగప్రవేశం దుర్భరమై నొప్పి కలుగుతుంది. ఈ స్థితి కొనసాగితే సంతానం కలుగదు. భావప్రాప్తి పూర్తిస్థాయిలో కలగదు. లేదా అసలు కలగదు. ఈ యోని ఫెయిల్యూర్‌ అనేది వారిలో ఆందోళనను మరింత పెంచి స్త్రీ పురుషులిరువురిలో సెక్స్‌ సమస్యలను మరింత అధికం చేస్తుంది.

చికిత్స: ట్రాన్‌క్విలైజర్స్‌ వాడితే ఆందోళన స్థాయి పడిపోతుందని అనుకుంటారు. కానీ, అది పూర్తిగా తప్పని తేలింది. మానసిక చికిత్స, సెక్స్‌ కౌన్సెలింగ్‌, డీపర్‌ రిలాక్సేషన్‌ టెక్సిక్స్‌, సెక్స్‌ థెరపీలో ఎస్‌.ఎఫ్‌.ఇ., జి.ఎస్‌.ఇ., ఆర్‌.సి.ఇ., బాగా పనిచేస్తుంది. బి.ఎమ్‌.టి., డి.ఎస్‌.టి., సి.టి. లాంటివి సైకోథెరపీలో భాగంగా ఇస్తే ఇద్దరికీ మంచి ఫలితం ఉంటుంది. దంపతులు ఆందోళనను నియంత్రించుకుని ప్రశాంతంగా, సహజంగా శృంగారంలో పాల్గొనాలి.

ప్రశ్నలు, జవాబులు..

1. మేడమ్‌! నాకు పెళ్లై ఏడు నెలలు అవుతోంది. ఇప్పటి దాకా మా మధ్య సెక్స్‌ జరగలేదు. ఆయనకు అంగస్తంభన సరిగా లేదు. ఇంట్లో విడాకులు తీసుకోమంటున్నారు. ఆయనను డాక్టరు వద్దకు వెళదామంటే రారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. మా ఇంట్లో విడాకుల ఒత్తిడి ఎక్కువ అవుతోంది. నా జీవితం నాశనం అయినట్లేనా? పెళ్లికి ముందు బాగానే ఉంది అంటారు. మరి, పెళ్లి తర్వాతే ఇట్లా ఎందుకు అవుతోంది. నన్నేం చేయమంటారు?

జవాబు: నిరాశకు గురికావద్దు. పెళ్లికి ముందు మంచి అంగస్తంభన ఉండి తర్వాత ఫెయిల్‌ అవుతుందంటే బహుశ అది తీవ్రమైన ఫర్‌ఫార్మెన్స్‌ ఆందోళన వల్ల అయి ఉండచ్చు. కొంతమందికి తమ లైంగిక సామర్థ్యం మీద అనుమానాలుంటాయి. సక్సెస్ అవుతానో, ఫెయిల్‌ అవుతానేమో అనే భయాలుంటాయి. ఖచ్చితంగా ఫెయిల్‌ అవుతానన్న ముందస్తు నెగెటివ్‌ ఆలోచనల వల్ల దేహానికి, మనసుకు మధ్య బ్లాక్‌ ఏర్పడి అంగస్తంభనకు కావాల్సిన రసాయనిక, నాడీ సంబంధ సెక్స్‌ హార్మోన్‌ సంబంధ కారకాల విడుదల ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరిగి అంగస్తంభన పూర్తిస్థాయిలో కాదు. ఒకసారి ఇలా ఫెయిల్‌ అయితే మళ్లీ అలానే జరిగి తీరుతుందన్న బలమైన అభిప్రాయం మళ్లీ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. దీన్నే సైకోజెనిక్‌ ఎరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌' అంటారు. దీనికి మానసిక కారణాలే అధికం. దీనికి 'సైకోసెక్సువల్‌ థెరపీ' అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, అంగస్తంభన లోపాలకు ఆర్గానిక్‌ కారణాలు అంటే శరీరంలో వ్యాధులేమైనా కారణమేమో కూడా వెతకాలి. డయాబెటిస్‌, బీపీ, గుండెజబ్బులు, స్పైనల్‌ కార్డ్ సమస్యలు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు, హార్మోన్‌ సమస్యలు, థైరాయిడ్‌ సమస్య, వెరికోసిల్‌, అథిరోస్క్లిరోసిస్‌ లాంటివి కారణాలా డయాగ్నోస్ చేసి చికిత్స ఇవ్వాలి. ముందు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. అతను మీకెంత ముఖ్యమో చెప్పండి. మీరు విడాకులు కోరుకోవట్లేదని, అతనికున్న సమస్యను పరిష్కరించడంలో తోడుంటానని చెప్పండి. మీ అత్తమామలతో కూడా మాట్లాడి అతన్ని ఒప్పించి సెక్సా లజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లండి. అయినా, అతను మొండికేస్తే మీ తల్లిదండ్రులు చెప్పినట్టు చేయండి.

2. నా వయసు 30. పెళ్లయి ఐదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. సెక్స్‌ పాల్లొనేటవ్సుడు నా భార్య మూడ్‌ రావదటం లేదని అంటుంది. తను చాలా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడూ మూడీగా ఉంటుంది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు.

జవాబు: మీ భార్య మానసిక స్థితిని ఫ్రిజిడిటీ అంటారు. అంటే శృంగారంపై అనాసక్తిని కలిగి ఉండటం. దీనికి చాలా కారణాలుంటాయి. సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆమెకేదైనా నొప్పి అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి, అంతర్‌ బాహ్య జనంనాంగాలకు ఏమైనా ఇన్ఫెక్షన్‌ సోకడం వల్ల, సెక్స్‌ తర్వాత నొప్పి వంటివి కలుగుతున్నాయేమో చూడాలి. ఇవన్నీ శారీరక కారణాలు, ఇవి తగ్గడానికి గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఇక రెండోది, శృంగారంలో ఆమెకు ఇష్టం రాకుండా ఉండేలా మీ ప్రవర్తన ఉందేమో చూసుకోండి. అంటే ఆమెతో ప్రేమగా లేకపోవడం, మానసికంగా, శారీరకంగా మీరు ఆమెను వేధించటం, ఆమెను అవమానించటం వంటి పనులు చేస్తున్నారేమో సరిచేసుకోండి. అలాగే అత్తింటిలో తన ఇబ్బందులను పట్టించుకోని భర్త వల్ల కూడా స్త్రీలు అతని స్పర్శకు స్పందించరు. దీనివల్ల మనిషి పట్ల ప్రేమ పోయి, అనాసక్తి, మనో శారీరక స్పందనలు లేని స్థితికి చేరుకుంటారు. కాబట్టి ప్రేమ చాలా ముఖ్యం. భర్త ఇచ్చే గౌరవం, ప్రేమతో కూడిన స్పర్శకే స్త్రీలు స్పందిస్తారు. మీలో ఇలాంటి లోపాలు ఉంటే పోగొట్టుకుని, మీ భార్యకు దగ్గర కండి. అలాగే కలయిక ముందు 20-30 నిమిషాలు ఫోర్‌ప్లే చేయండి. ఆమెకు ఒకసారి భావప్రాప్తి వచ్చాకే సంయోగంలో పాల్గొనండి. అన్నిటికంటే ముందు ఆమెకు అనాసక్తి ఎందుకు వచ్చిందో కనుక్కోండి. ఆ కారణాలకు తగినట్టుగా పరిస్థితులను మార్చండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే సెక్సాలజిస్టుకు చూపించండి. ఫ్రిజిడిటీకి పై కారణాలే కాకుండా గర్భధారణ, పిల్లల పెంపకం, ఇంటిపని ఎక్కువగా ఉండటం, మళ్లీ గర్భం వస్తుందేమోనన్న భయాలు కూడా కారణాలు కావచ్చు, గమనించండి.

డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

79892 27504

askdoctorbharathi@gmail.com

Tags:    

Similar News