లోక కళ్యాణం వీ‌హెచ్‌పీ లక్ష్యం

శ్రీకృష్ణాష్టమి రోజున ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్నది. వీ‌హెచ్‌పీ ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల

Update: 2022-08-18 18:30 GMT

గ్రామగ్రామంలో కరసేవకులు, రామ భక్తులను తయారు చేసింది వీ‌హెచ్‌పీ. 1985 డిసెంబర్‌లో 'రామజన్మభూమి న్యాస్' ఏర్పాటు చేసింది. శ్రీ జగద్గురు రామానందాచార్య శ్రీ శివరామాచార్యజి మహారాజ్, అశోక్ సింఘాల్‌జీ వంటి బలమైన ధార్మికవేత్తల నేతృత్వంలో లక్షలాది సాధుసంతులు, స్వయం సేవకులు ఉద్యమించారు. చివరికి సుప్రీంకోర్టులో 2019 నవంబర్ 9న అయోధ్యను సాధించిన ఘనత వీ‌హెచ్‌పీదే. ఏకాత్మక యజ్ఞం, మీనాక్షి సంఘటన, అయోధ్య ఉద్యమం ద్వారా హిందువులను కదిలించింది. హిందువులకు భరోసా కల్పించింది.

శ్రీకృష్ణాష్టమి రోజున ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్నది. వీ‌హెచ్‌పీ ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం. అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో విజయం సాధించిన 9 నవంబర్ 2019 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమి పూజ (ఆగస్టు 5, 2020) వరకు అందరి మదిలో మెదిలి చర్చకు మూలమైంది. 1964లో శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ శ్రీ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో వీ‌హెచ్‌పీ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థ అంకురార్పణ జరిగింది.

స్వామి చిన్మయానంద సరస్వతి తొలి అధ్యక్షులుగా కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేక సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో దినదినాభివృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అనుబంధంగా ఉంటూ ధార్మిక సామాజిక సేవా రంగాలలో తన కార్యకలాపాలను సాగించింది. దాదాపు 17 ప్రధాన విభాగాలలో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పుతున్నది. 1983లో ప్రతిష్టాత్మకంగా 'ఏకాత్మక యజ్ఞం' నిర్వహించింది. నవంబర్ 16 నుండి డిసెంబర్ 16 (1983)లో సామాజిక సమరసతా భావం నింపేందుకు అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి 'సకల హైందవ జాతి ఒక్కటే "అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపు మాపేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను రూపొందించింది.

మీనాక్షి సంఘటన

1981లో తమిళనాడు కేంద్రంగా హిందువులను మతం మార్చేందుకు భారీ కుట్ర జరిగింది. 'తిరువెళ్లి' అనే గ్రామంలో దాదాపు 180 మంది పేద దళిత కుటుంబాల వారిని మతం మార్చారు. దళితులంతా హిందువులు కాదని, హిందుత్వం దళిత వ్యతిరేకి అని అసత్యాలను నూరిపోసి మత మార్పిడికి యత్నించారు. దీంతో వీ‌హెచ్‌పీ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి సమస్యను ప్రజలలోకి తీసుకువెళ్లింది. ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి మతమార్పిడి మాఫియా కోరలు పీకింది. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ స్పందించేలా చేసింది. దళిత సామాజికవర్గాన్ని గద్దలా ఎగరేసుకుని పోవాలనుకునే మతోన్మాదుల ఆటలు చిత్తు చేసింది. ఈ సంఘటన ఆధారంగా యావత్ హిందూ సమాజం జాగృతమై ఎక్కడికక్కడ ప్రతిఘటించే వాతావరణం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

అయోధ్య ఉద్యమం

గ్రామగ్రామంలో కరసేవకులు, రామ భక్తులను తయారు చేసింది వీ‌హెచ్‌పీ. 1985 డిసెంబర్‌లో 'రామజన్మభూమి న్యాస్' ఏర్పాటు చేసింది. శ్రీ జగద్గురు రామానందాచార్య శ్రీ శివరామాచార్యజి మహారాజ్, అశోక్ సింఘాల్‌జీ వంటి బలమైన ధార్మికవేత్తల నేతృత్వంలో లక్షలాది సాధుసంతులు, స్వయం సేవకులు ఉద్యమించారు. చివరికి సుప్రీంకోర్టులో 2019 నవంబర్ 9న అయోధ్యను సాధించిన ఘనత వీ‌హెచ్‌పీదే. ఏకాత్మక యజ్ఞం, మీనాక్షి సంఘటన, అయోధ్య ఉద్యమం ద్వారా హిందువులను కదిలించింది. హిందువులకు భరోసా కల్పించింది.

1975లో సత్యవ్రతం నిర్వహించింది. తిరుపతి కేంద్రంగా 1985, 1988 సంవత్సరాలలో 'హిందూ మహా సమ్మేళనాలు' నిర్వహించింది. లక్షలాది హైందవ సోదరులు హిందూ సంఘటన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నారు. 1975లో కర్నూలులో జ్ఞానపీఠం ఏర్పాటు చేసింది. బాలబాలికల సంక్షేమం కోసం గిరిజన వికాస కేంద్రం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అనాధ ఆశ్రమాలు, ఆవాసాలు దిగ్విజయంగా నిర్వహిస్తోంది. గంగానది పవిత్రతను కాపాడేందుకు భారతమాత, గంగామాత యాత్ర నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి నదీ జలాలు తీసుకుని వచ్చి గంగలో కలిపి ప్రతిజ్ఞ చేసింది. గంగానది పవిత్రతను, ప్రాముఖ్యతను వివరిస్తూ ఉద్యమం చేపట్టింది.

జీవితాలను త్యాగం చేసి

గోమాత హిందువులకు ప్రత్యక్ష దైవం కాబట్టి గోసంతతిని కాపాడేందుకు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గోవులే కాదు ప్రకృతిలోని ప్రాణికోటి నంతటిని సంరక్షించేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక అసమానతలు, ఆర్థిక ఒడిదుడుకులు, నిరక్షరాస్యత, తెలియనితనం, అవగాహన లోపం కారణంగా హిందూ ధర్మాన్ని వీడుతున్న వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకు వచ్చేందుకు 'ఘర్ వాపసీ' నిర్వహించింది.

'లవ్ జిహాద్'లో చిక్కుకున్న అమ్మాయిలకు అవగాహన కలిగించింది. దేవాలయాలలో జరిగే అక్రమాలు, అన్యాయాలను నిలదీస్తూ ఆలయాల పవిత్రతను కాపాడుతోంది. వేలాది మంది కార్యకర్తలు వారి జీవితాలను దేశం కోసం, ధర్మం కోసం, పవిత్ర మనసుతో త్యాగం చేస్తున్నారు. వీ‌హెచ్‌పీ ప్రచారకులు హిందూరక్షణ యజ్ఞంలో సమిధలుగా మారుతున్నారు. మధుర, కాశీ పుణ్యక్షేత్రాలను సైతం సొంతం చేసుకోవాలనేది సంకల్పం.

(నేడు వీ‌హెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం) 

పగుడాకుల బాలస్వామి

వీ‌హెచ్‌పీ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్

99129 75753

Tags:    

Similar News