నిరుద్యోగుల స్వప్నం సాకారం!

Unemployed dream come true in Telangana

Update: 2024-03-14 00:30 GMT

మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. కానీ అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆక్రందనలను పట్టించుకోలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన కోర్టు కేసుల వలన రిక్రూట్మెంట్ నత్తనడకన సాగింది. మొత్తానికి అప్పటి ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే ఆశా స్వప్నంగా ఉన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను రిక్రూట్ చేస్తానని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరం. దీంతో నిరుద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి భయాలు లేకుండా నిస్సంకోచంగా నిర్విరామంగా చదవవచ్చు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల పైన తన దృష్టిని సారించింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసింది. త్వరలోనే ఐదు, ఆరు గ్యారెంటీలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలుగా మిగిలినవో వాటిని సరి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది. అందులో ముఖ్యమైంది ఉద్యోగ నోటిఫికేషన్లు. ఇప్పటికే దాదాపుగా 30 వేల పైచిలుకు ఉద్యోగాలను నియమించింది. సింగరేణి పోలీస్ కానిస్టేబుల్స్ గురుకుల టీచర్స్, స్టాప్ నర్స్ ఉద్యోగుల నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ 4 మెరిట్ లిస్టు జాబితా కూడా ప్రకటించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. త్వరలో గ్రూప్ 2, 3 పోస్టులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే ఆశా స్వప్నంగా ఉన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను రిక్రూట్ చేస్తానని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. నిరుద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి భయాలు లేకుండా నిస్సంకోచంగా నిర్విరామంగా చదవవచ్చు. కచ్చితంగా నిరుద్యోగులను అన్యాయం చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నట్టుగానే నోటిఫికేషన్ లో విడుదల కానీ పరీక్షల ఫలితాలు ప్రకటించడంలో కానీ త్వరితగతమైన వేగంతో నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వ చర్యల వలన నిరుద్యోగులు ఎంత చదివినా ఉద్యోగం నోటిఫికేషన్‌లు వేయకపోవడం వలన చాలామంది వివాహాలు కాకుండా నిరుద్యోగుల జీవితాలు అస్తవ్యస్తమైనవి. ప్రస్తుత ప్రభుత్వం యొక్క కదలికలు నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే రేవంతన్న పాలకుడిగా ఉంటే మనకు ఏ భయం లేదని నిరుద్యోగులు మనసులో ఒక స్వప్నమైతే కచ్చితంగా ఉంది.

- నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి

81061 40667

Tags:    

Similar News