నీట్‌లో వెనకబడుతున్నాం!

నీట్ ఫలితాలు వెలువడిన వెంటనే కొద్దిమంది తెలుగు విద్యార్థులకు వచ్చిన జాతీయ ర్యాంకుల గురించి కార్పొరేట్ కళాశాలలు చేస్తున్న మితిమీరిన వ్యాపార

Update: 2024-08-09 00:45 GMT

నీట్ ఫలితాలు వెలువడిన వెంటనే కొద్దిమంది తెలుగు విద్యార్థులకు వచ్చిన జాతీయ ర్యాంకుల గురించి కార్పొరేట్ కళాశాలలు చేస్తున్న మితిమీరిన వ్యాపార ప్రకటనలతో అనేక వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. అయితే ఆ ఫలితాలను నిశితంగా గమనిస్తే మేడిపండు సామెత గుర్తుకు వస్తుంది. 2019 నుంచి 2024 వరకు వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో నీట్ ఆల్ ఇండియా కోటా కింద మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లు అంటే దాదాపు వెయ్యి సీట్లు ఏటా కేటాయిస్తున్నాం. అయితే మన విద్యా ర్థులు అందులో గరిష్టంగా 250 సీట్లకు మించి పొందలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా కార్పొరేట్ కళాశాలల ఆధీనంలో ఉండడం, కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ అజమాయిషీ మాత్రం లేకపోవడం. పైగా డబ్బే ప్రధానంగా పనిచేసే కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను ప్రతిభ ఆధారం గా వివిధ సెక్షన్లుగా విడగొట్టి అత్యంత ప్రతిభ కనబరిచే కొన్ని సెక్షన్లకే నాణ్యమైన విద్యను అందించడం, మిగిలిన విద్యార్థులపై ఎటువంటి శ్రద్ధ పెట్టకపోవడం వంటి కారణాలు జాతీయ స్థాయిలో మన విద్యార్థుల సంఖ్యను తగ్గేలా చేస్తున్నాయి.

మనకంటే.. బిహార్ బెటర్..

2019లో అఖిల భారత స్థాయిలో 50వేలలోపు ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సంఖ్య 2856 (5.7%)గా ఉంటే 2024లో అది కేవలం 1400 (2.8%). అదేవిధంగా 50 వేలలోపు ర్యాంకు సాధించిన తెలంగాణ విద్యార్థులు 2019లో 1500 (3%) పైగా ఉంటే ఈ సంవత్సరం కేవలం 673 (1.3%). దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక మనకన్నా రెండు, మూడు రెట్లు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ కూడా మనకన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.

పోటీ పడలేక..

అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంక్‌లు సా ధించిన తెలుగు విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గడం వలన దేశంలో పేరొందిన ఎయిమ్స్, జిప్మర్ మొదలైన వైద్య కళాశాలల్లో ప్రవేశించే తెలుగు విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. అదే విధంగా నీట్ ఆల్ ఇండియా కోటాలో మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడలేక పోవడం వలన మనం వందలాది మెడికల్ సీట్లను నష్టపోతున్నాం. తెలుగు రాష్ట్రాల నీట్ ఆల్ ఇండియా కోటా కింద మన ప్రభుత్వ మెడి కల్ కాలేజీల్లోని 15% సీట్లు అంటే దాదాపు వెయ్యి సీట్లు ఏటా కేటాయిస్తున్నాం. అయితే మన విద్యార్థులు అందులో గరిష్టంగా 250 సీట్లకు మించి పొందలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా కార్పొరేట్ కళాశాలల ఆధీనంలో ఉండడం, కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ అజమాయిషీ ఏమాత్రం లేకపోవడం.

అనైతిక విధానాలకు అడ్డుకట్టవేస్తేనే..

డబ్బే ప్రధానంగా పనిచేసే కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను ప్రతిభ ఆధారంగా వివిధ సెక్షన్లుగా విడగొట్టి అత్యంత ప్రతిభ కనబరిచే కొన్ని సెక్షన్లకే నాణ్యమైన విద్యను అందిం చడం, మిగిలిన విద్యార్థులపై ఎటువంటి శ్రద్ధ పెట్టకపోవడం వంటి కారణాలు జాతీయ స్థాయిలో మన విద్యార్థుల సంఖ్యను తగ్గేలా చేస్తున్నాయి. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని వందలాది మెడికల్ సీట్లు ఇతర రాష్ట్రాల వారికే ఉపయోగపడుతున్నాయి. దీని వలన ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్ప మన విద్యార్థులకు ఉపయోగం ఏమీ లేకుండా పోతుం ది. ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యపై దృష్టి పెట్టి, వ్యాపార దృక్పథంతో కార్పొరేట్ కళాశాలలు చేస్తున్న అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేయాలి. విద్యార్థులందరికీ ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందే విధంగా కృషి చేయాలి.

ఇలా చేయాలి..

ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్న రాష్ట్రమైన కేరళ విద్యార్థులు ఏపీ విద్యార్థుల కన్నా 167% అధికంగా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నా రు. కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసినట్లయితే వైద్య విద్య కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపా యలు వృధా కాకుండా మన విద్యార్థులకే ఉపయోగపడతాయి. ప్రభుత్వమే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో ఇంటర్మీడియట్ విద్యను గురుకుల పద్ధతిలో అందజేసినట్లయితే తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా కాపాడడమే కాకుండా ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సాహించినట్లు అవుతుంది. తెలం గాణ ప్రభుత్వం కూడా సత్వర నిర్ణయాలు తీసుకుని మన విద్యార్థులకు ప్రయోజనం సిద్ధింపజేయాల్సి ఉంది.

డా. ఆలా వెంకటేశ్వర్లు

రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్

73373 02256

Tags:    

Similar News