అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇంకా ఎందుకు కొనసాగించాలంటే..

అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ కారణంగా ప్రతిభగల వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ కొందరు వాదిస్తుంటారు. కానీ

Update: 2024-09-12 01:30 GMT

అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ కారణంగా ప్రతిభగల వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ కొందరు వాదిస్తుంటారు. కానీ వారికి తెలియనది తరతరాలుగా వందల ఏళ్ల నాటి చాతుర్వర్ణ వ్యవస్థ దళిత గిరిజనుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది అని.. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగేందుకు మంచి నీళ్లు సైతం లేక సమాజంలో జంతువుల కంటే హీనంగా చూడబడిన జాతులను మిగిలిన వర్గాల వారితో సమానంగా చూసేందుకు, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ రిజర్వేషన్లు ఉద్దేశించబడ్డాయని. కానీ, రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక అవసరమని, క్రీమీలేయర్ అమలు చేయాలనే వారికి కూడా తంగలాన్ సినిమా సరైన సమాధానం చెబుతుంది. 

సామాజికంగా అణిచివేతకు గురైన వారికి కల్పించిన రిజర్వేషన్ల ద్వారా సామాజిక అభ్యున్నతికి అవకాశాలు కలుగుతాయి. కానీ ఆర్థిక ప్రాతిపదికకు సామాజిక అసమానతలకు పొంతన కుదరదు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దళిత కుటుంబాలను సమాజంలో తమతో సమానంగా చూసేందుకు ఉన్నత వర్గాల వారు అంగీకరించకపోవడం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానం లో ఉన్న దళిత కుటుంబాల వారికి అద్దెకు ఇల్లు కూడా ఇవ్వకపోవడం చూస్తున్నాం. క్రీమీలేయర్ విధానానికి దళితులు ఎందుకు అతీతులు అనేది ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, జంతువులకు ఇచ్చిన గౌరవానికి సాటి మనుషులైన దళిత గిరిజన ఆదివాసీలు నోచుకోకపోవడం అమానవీయతకు తార్కాణం.

ఏళ్ల చారిత్రక ఆనవాళ్లకు చిత్రరూపం

"చరిత్ర తెలియకపోతే చరిత్ర సృష్టించ లేం" అంటారు డా.బీఆర్ అంబేడ్కర్. వందల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లకు చిత్రరూపంగా, మనిషిని మనిషిగా చూడలేని సమాజ పోకడలు, దళిత, గిరిజన, మహిళల అగచాట్లు, భూమి లేని నిరుపేదలకు సామాజికంగా ఎదు రయ్యే కష్టాలు, కన్నీళ్లు, "సంఘం శర ణం గచ్చామి" అంటూ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన గౌతమ బుద్దుడి ఆనవాళ్లు చెరిపే ప్రయత్నాల దాఖ లాలు, బలీయమైన నాగజాతి మూలా లు, ఈ దేశ ఖనిజ సంపదలకు రక్షణ కల్పించిన మూలవాసుల చారిత్రక వాస్తవాలు, సామాజిక అసమానతలు తొలగిపోతాయంటూ జంధ్యం ధరించి న దళితులకు అంతిమంగా ఎదురైనా అవహేళనలు, కట్టుబట్టలకు నోచుకోని దళితుల దీనగాధలు, గంజి నీళ్లకు నిలువనీడకు, చిల్లిగవ్వకు కరువై దారిద్ర్యానికి, బానిసత్వానికి లోనైన కడజాతుల యదార్థ జీవిత వ్యథార్థ దృశ్యం తం గలాన్ చలనచిత్రం. మనుధర్మ ప్రతినిధి అయిన ఒక బ్రాహ్మణ పురోహితులు బుద్ధ భగవానుని ప్రతిమ తల నరికి దళితుల భూములు ఆక్రమించి అదే భూమిలో అదే దళితులను బానిసలుగా చేసి వారి ఆస్తులను ఆత్మాభిమానాన్ని బలవంతంగా లాక్కున్న అమానవీయతకు చిత్ర రూపమే తంగలాన్.

సమాజహితమే పరమావధిగా భావించి..

అంటరానితనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన నేటి దళిత గిరిజనుల జీవిత మూలాలను వెలికి తీసే ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించిన చిత్ర దర్శకుడు పా. రంజిత్ తనకు మాత్రమే సొంతమైన సాహసాన్ని చేశారు. కాసుల పంటలు పండే చలనచిత్రాల కంటే సమాజ హితమే పరమావధిగా భావించే ఈ చిత్ర దర్శక నిర్మాతలు అభినందనీయులు.

సామాజిక అసమానతలను పరాకాష్టగా..

తంగలాన్ పాత్రధారుడు విక్రమ్ ఒక పోరాటంలో చేసిన సాహసాలతో కట్టుకునేందుకు మంచి బట్టలు పొందుతా డు. దాంతో ఒక గొప్ప విజయాన్ని సాధించిన అనుభూతిని ప్రదర్శించడం చూస్తే వారి దయనీయ జీవితం అర్థం అవుతుంది. మొలకు ఒక చిన్న వస్త్రం తప్ప శరీరానికి కప్పుకునేందుకు మరో అవకాశం లేదు. స్త్రీలకు తమ వక్షోజాలను కప్పుకునేందుకు రవికలు ధరించాలంటే పన్నులు చెల్లించాలి. దళితులను మనుషుల్లో అధములుగా చూపించేందుకు వారికి శరీరం నిండా బట్టలు లేకుండా చేయడం అనే దమన నీతి ఆనవాయితీగా మారింది. స్త్రీలు రవికలు లేకుండా మోకాళ్ల పైవరకు చీర కట్టుకోవాలి, పురుషులు కేవలం అంగాన్ని బయటకు కనిపించకుండా ఒక వస్త్రాన్ని కట్టుకోవాలి. అందుకే దీనిని అంగవస్త్రం అంటారేమో.. ఈ చలనచిత్ర కథానాయకుడు తంగలాన్ తన భార్యకు రవికలు తీసుకువచ్చినప్పుడు ఆమె పడిన ఆనందం సరియైన బట్టలు కట్టుకోలేని వారి జాతి దీన స్థితిని సూచిస్తుంది. దళిత ఆదివాసీలను కట్టుబట్టలకు దూరం చేసిన మనువాద మూలాలు సామాజిక అసమానతలకు పరాకాష్టగా ఆవిష్కరితమైన దుర్మార్గమైన దుర్నీతిని తేటతెల్లం చేసిన చారిత్రక వాస్తవాలను మన ముందుకు తీసుకు వచ్చిందీ చిత్రం.

ఈ వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

తంగలాన్ సినిమా సామాజిక అసమానతల నేపథ్యంలో స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం, భూమి కోసం పోరాడిన దళితుల జీవన గాథ. బానిసత్వం నుండి తమను తాము విముక్తి పొందేందుకు తంగలాన్ తెగవారు బంగారు గనుల అన్వేషణలో భాగమయ్యారు. 1885లో తమిళనాడులో జరిగిన ఈ సంఘటనలు దేశంలోని అణగారిన వర్గాల జీవన స్థితిగతులు, అణచివేత, అంటరానితనం, వారు ఎదుర్కొన్న ఛీత్కారాలు, అవమానాలు, జంతువుల కంటే హీనంగా బతికిన బతుకు పోరాటం, బానిసత్వం, సామాజిక వివక్షతలకు చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, జం తువులకు ఇచ్చిన గౌరవం సాటి మనుషులైన దళిత గిరిజన ఆదివాసీలు నోచుకోకపోవడం అమానవీయతకు తార్కాణం. అణగారిన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా సము న్నత గౌరవాన్ని, హక్కులను, అవకాశాలను కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప తనం ఏమిటో ఈ చిత్రం రుజువు చేస్తుంది.

- నేలపూడి స్టాలిన్ బాబు,

సామాజిక రాజకీయ విశ్లేషకులు,

83746 69988 

Tags:    

Similar News