సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్య తీర్చండి!

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న రోజుల్లో 1980 దశకంలో కొత్తగా సింగరేణి బొగ్గు గనులు

Update: 2024-11-02 00:30 GMT

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న రోజుల్లో 1980 దశకంలో కొత్తగా సింగరేణి బొగ్గు గనులు ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో ఈ గనుల్లో ఎంప్లాయిమెంట్ కార్డు ఉంటేనే ఉద్యోగం వచ్చేది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో సీనియారిటీ లేకపోవడంతో కొందరు ఉద్యోగాలు దొరకవనే బెంగతో సీనియారిటీ పేరుతో ఉన్న ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్న వ్యక్తుల పేర్లతో సింగరేణి ఉద్యోగం పొందారు. అయితే, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2010లో ఆధార్ కార్డు విధానం అమలులోకి వచ్చింది. అయితే, సింగరేణిలో మారు పేర్లతో పని చేసిన కార్మికులు తమ అసలు పేరుతో తమ గ్రామాల్లో ఉన్న చిన్నపాటి పొలం, ఇళ్లు పోకుండా ఉండేందుకు ఆధార్ కార్డుని పొందారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్, సింగరేణి డేటా బేస్‌తో సరితూగక పోవడం‌తో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అయిన తరువాత కార్మికునికి రావలసిన పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మెడికల్‌గా అన్- ఫిట్ కాబడ్డ కార్మికుని వారసులకు కూడా ఉద్యోగం పొందలేక పోతున్నారు.

ఇచ్చిన హామీలేవీ నెరవేరలే..!

ఈ మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని కోల్ బెల్ట్ ప్రాంతంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు హామీలు ఇచ్చి మరచిపోవడం జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి మెడికల్ అన్ ఫిట్ అయిన మారు పేర్ల బాధిత వారసులకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగం కల్పించడంలో తిరకాసు పెడుతుంది. నిరక్షరాస్యత ఉన్న పాత కాలపు కార్మికులు పని దిగిపోయిన తరువాత అటు టెర్మినల్ బెనిఫిట్స్ రాక, ఇటు వారసులకు ఉద్యోగాలు రాక బీదరికంతో బాధ పడుతున్నారు. ఇటీవల కాలంలో కోల్ బెల్ట్ ప్రాంతంలోని మారుపేర్లతో వారసత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగులు తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి‌కి పోస్ట్ కార్డుల ద్వారా తమ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ఉన్న మారు‌పేర్ల సమస్యను మానవతా దృక్ప థంతో ఆలోచించి సింగరేణి యాజమాన్యంకు తగిన ఆదే శా లు జారీ చేయాలని కోల్ బెల్ట్ ప్రాంత వాసులు కోరుతున్నారు.

ఆళవందార్ వేణు మాధవ్

ఉప ప్రధాన కార్యదర్శి

సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్ అసోసియేషన్

86860 51752

Tags:    

Similar News