సలేశ్వరం మహా దివ్య క్షేత్రం

ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం మహాక్షేత్రం కొలువై ఉన్నది. ఉగాది పర్వదినం గడిచాక వచ్చే మొదటి చైత్ర పౌర్ణమికి ముందు రెండు రోజులు, తర్వాత రెం

Update: 2022-04-16 18:30 GMT

ప్రమాదకర దారులు ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడానికి కారణం దేవుని మహిమ అంటారు. మున్ననూర్ నుంచి అటవీ దారి, బల్మూర్ మండలం దివాగు నుండి, లింగాల నుండి అడవి మార్గం నుంచి కాలి నడకన కూడా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి ,లుండి మల్లన్న, ఉమా మహేశ్వరం ఈ నాలుగు లింగాలు అందరికీ తెలుసు. ఐదవ లింగం నల్లమల్ల అడవిలో ఎక్కడుందో ఇప్పటికి రహస్యంగానే మిగిలిపోయింది.

మ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం మహాక్షేత్రం కొలువై ఉన్నది. ఉగాది పర్వదినం గడిచాక వచ్చే మొదటి చైత్ర పౌర్ణమికి ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు మొత్తం ఐదు రోజుల పాటు ఇక్కడ జరిగే మహోత్సవానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. దట్టమైన అడవిలో ఉన్నందున అటవీ శాఖ అధికారులు స్థానికంగా ఉండే చెంచు ప్రజల సహకారంతో మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ జనసంచారం లేని ప్రాంతం అయినందున ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. పూర్వం ఈ దట్టమైన అడవిలో పులులు సంచరించేవి. అందుకే దీనిని దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం గా పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వం 1973లో 'టైగర్ ప్రాజెక్టు'గా నామకరణం చేసింది.

ఇప్పటికి రహస్యంగానే

హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి వెంట 150 కిలోమీటర్ల దూరంలో ఫరహాబాద్ గేటు నుంచి 32 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉన్నది. అటవీశాఖ అధికారుల సహాయంతోనే ఇక్కడికి చేరుకోవాలి. ప్రకృతి ప్రేమికుడైన నిజాం రాజు తన వేసవి విడిది కోసం ఇక్కడ భవనాలు నిర్మించుకొని ఏటా వచ్చేవాడని, అందుకే ఈ ప్రాంతానికి ఫరహాబాద్ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. దేవాలయం వరకు వాహనాలు వెళ్లవు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల నడక తప్పదు. ప్రకృతి రమణీయతతో ఎత్తయిన కొండల నుండి పాల నురుగులా జాలువారే జలపాతం, కొండల అడుగు భాగంలో లింగమయ్య గుడి, ఆ గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు కనిపిస్తాయి.

ఇరుకైన దారులు, రాళ్లు రప్పలు భయాన్ని కలిగించేలా ఉన్నా కూడా ఇష్టంతో కష్టాలను లెక్కచేయకుండా సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు. ప్రమాదకర దారులు ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడానికి కారణం దేవుని మహిమ అంటారు. మున్ననూర్ నుంచి అటవీ దారి, బల్మూర్ మండలం దివాగు నుండి, లింగాల నుండి అడవి మార్గం నుంచి కాలి నడకన కూడా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి ,లుండి మల్లన్న, ఉమా మహేశ్వరం ఈ నాలుగు లింగాలు అందరికీ తెలుసు. ఐదవ లింగం నల్లమల్ల అడవిలో ఎక్కడుందో ఇప్పటికి రహస్యంగానే మిగిలిపోయింది.

దక్షిణ తెలంగాణ ఆలయాలు

సలేశ్వర మహాక్షేత్రం గురించి కొన్ని చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. 13వ శతాబ్దంలో పాల్కురి సోమనాథుడు 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర'లో సలేశ్వర క్షేత్రం విశేషాలను వివరించారు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన సలేశ్వరంలో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు లింగమయ్య తన ఇష్ట భక్తుల నుంచి పూజలు స్వీకరించబోతున్నాడు.

తెలంగాణ ఏర్పడక ముందు భద్రాచలం మినహాయిస్తే చెప్పుకోదగ్గ పెద్ద ఆలయాలు లేవు కానీ, రాష్ట్రం సిద్ధించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వం యాదగిరిగుట్టను మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి. అందులో సలేశ్వరం, లొద్ది, ఉమా మహేశ్వరం, మల్లెలతీర్థం, పిల్లలమర్రి, మన్యంకొండ, అలంపూర్ జోగులాంబ ఆలయాలను అభివృద్ధిపరిచి, పర్యాటక కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం పూనుకుంటే మంచిది. సకల సౌకర్యాలను, వసతులను ఉంటే కొందరికి ఉపాధి దొరుకుతుంది. పర్యాటకాభివృద్ధి జరుగుతుంది.

డా. పొలం సైదులు ముదిరాజ్

94419 30361

Tags:    

Similar News