Xi Jinping tour: గల్ఫ్ దేశాలతో చైనా మైత్రి దేనికోసం?

Xi Jinping tour: గల్ఫ్ దేశాలతో చైనా మైత్రి దేనికోసం?... real story of Xi Jinping has started tour to world countries

Update: 2022-12-13 18:30 GMT

చైనా విషయంలో గల్ఫ్ సహకార సమాఖ్య సహకారాత్మక ధోరణి అనుసరించినా, ఆ దేశం మీద ఓ కన్ను వేసి ఉంచాలి. గల్ఫ్ దేశాలలో భారతీయులు ఎక్కువగా ఉండటం చైనా సహించలేకనే 'మా సంస్కృతి, భాష కూడా గొప్పవి' అనే విధంగా ఒప్పందంలో చేర్చింది. దేశాల మైత్రి అనేది ఒప్పందాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండాలి. ఒప్పందాలకు కట్టుబడాలి. అప్పుడే దేశాల మధ్య మైత్రి చిగురిస్తుంది. దేశాల మధ్య దీర్ఘకాలం మైత్రి అంటే ఇండియా- రష్యాలదే. ఇప్పటికి ఈ రెండు దేశాలు తమ మైత్రిని కాపాడుకుంటున్నాయి. అలాగే చైనా అధ్యక్షుడు చేసే ఈ పర్యటన సత్పలితాలు ఇస్తే మంచిదే కానీ, బెడిసికొడితే చైనాను విశ్వంలో ఏ దేశం నమ్మదు. అప్పుడు చైనా ప్రకటనలకు విలువే ఉండదు.

చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ ఇటీవల అన్ని దేశాలను చుట్టి వస్తున్నారు. అందులో భాగంగా మంగోలియాతో సయోధ్య కుదుర్చుకుని, కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సౌదీలోనూ పర్యటించి ఆ దేశాన్ని పొగుడుతూ సహకారాత్మక ధోరణితో ఉండాలని హితబోధ చేశారు. నిజానికి గల్ఫ్ సహకార మండలి లేదా సమాఖ్య దేశాలతో(Gulf Cooperation Council) ఎంత మిత్ర భావంతో ఉంటే అంత మేలని ఆయన అనుకున్నారు. జీసీసీ సంపన్న సమాఖ్య అని గ్రహించారు. వారి సహజ వనరు అయిన చమురు, ఖర్జూరాల మీదా దృష్టి సారించారు. అందుకే జిన్‌పింగ్ ఆ దేశంలో పర్యటించారు. వారి సహకారం కోరుతూనే, ఐక్యత ముఖ్యమని ఉటంకించారు. కానీ, ఇదే ఐక్యత భారత్ పట్ల ఎందుకు చూపడం లేదో అర్థం కాని ప్రశ్న.

వారి ఆంతర్యం ఏమిటో?

సౌదీలో పర్యటించిన జిన్‌‌పింగ్ జీసీసీ(GCC) సమాఖ్యలో చైనా భాగస్వామి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. దీనిని బట్టి ఇంధనం కొరకు జిన్‌‌పింగ్ గల్ఫ్‌తో సహకరించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతానికి దేశాలను నడిపేది ఇంధనం కనుక వాటిపై చైనా దృష్టిపెట్టింది. గల్ఫ్ దేశాలు సహజంగానే ఆర్థికంగా బలంగా ఉంటాయి. వారి సహకారం ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడికి గల్ఫ్ సమాఖ్య పూర్తి చేయూతనిచ్చింది. గగన విహారంలో, భాషా, సాంస్కృతిక రంగాలలో సహకారం కోరి, సహజ భాగస్వామ్యం అని చైనా చెప్పడం వెనుక దాని ఆంతర్యం బోధపడుతుంది.

దక్షిణ ఆసియాకు సమీపంలో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఎక్కువగా స్నేహాన్ని, సఖ్యతను కోరుకుంటాయి. ఇప్పటికే అమెరికాతో ఈ దేశాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. దానికంటే మిన్నగా సంబంధాలను మెరుగుపరచుకోవడానికి జిన్‌పింగ్ ఈ దేశాలలో పర్యటించి సఖ్యత, సుస్థిర అభివృద్ధి అనే బోధ చేస్తున్నారు. అయితే, ఈ పర్యటనను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. నిజానికి అమెరికా నుంచి గల్ఫ్ సమాఖ్యకు సాంకేతిక సహాయం అందుతుంది. ఎందుకంటే, ఈ దేశాలలో సాంకేతిక సౌలభ్యం తక్కువ. ఇప్పుడు దీనిపైనే చైనా దృష్టి పెట్టి ఈ సమాఖ్యకు దగ్గర కావాలని చూస్తున్నది. భారత్-గల్ఫ్(India-gulf countries relation) దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశాలలో భారతీయులు ఎక్కువగా పని చేస్తున్నారు. అందుకు ఆ దేశాల సహకారం ఉంది. అక్కడి భారతీయులకు ఏ ఇబ్బందీ లేదు. వారు ఆ దేశంలో ఇమిడిపోయారు. వారి సంస్కృతిలో భాగం అయ్యారు. అందుకే తాము సైతం 'భాషా సంస్కృతిని గౌరవిస్తాం' అంటున్నారు జిన్‌‌పింగ్.

ఒప్పందాలకు తిలోదకాలు

చైనా అధ్యక్షుడి(Jinping) గల్ఫ్ దేశాల పర్యటన వెనక ఒకటే అంతర్యం కనిపిస్తోంది. చైనా ఆసియా ఖండంలోనే దృఢమైన రాజ్యంగా ఎదగాలని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే జిన్‌‌పింగ్ వివిధ దేశాలలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే క్యూబా, మంగోలియా దేశాలను సందర్శించారు. ముఖ్యంగా ఇంధనం కోసం చైనా ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదని, సహకారాత్మక విధానాన్ని అవలంబిస్తున్నారు. కానీ, జిన్‌‌పింగ్ ఆయా దేశాలలో 'అభివృద్ధి' నినాదం ఎత్తుకోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే, అభివృద్ధి దేశంలో ఉండే వనరులను అనుసరించి ఉంటుంది. గల్ఫ్‌లో అవి మిక్కుటంగా ఉన్నాయి. అక్కడ అంతా అభివృద్ధే. గల్ఫ్ సహకారానికి డబ్బు ప్రధానం కాదు. స్నేహం, ఒప్పందాలు ముఖ్యం.

ఒక పక్క ఒప్పందాలు చేసుకుంటూ, మరోపక్క వాటికి తిలోదకాలు ఇవ్వడం సరికాదు. గతంలోనే చైనా మన దేశంతో పంచశీల ఒప్పందం చేసుకొని, ఉల్లంఘించి దాడి చేసింది. అందుకే, చైనా విషయంలో గల్ఫ్ సహకార సమాఖ్య సహకారాత్మక ధోరణి అనుసరించినా ఆ దేశం మీద ఓ కన్ను వేసి ఉంచాలి. గల్ఫ్ దేశాలలో భారతీయులు ఎక్కువగా ఉండటం చైనా సహించలేకనే 'మా సంస్కృతి, భాష కూడా గొప్పవి' అనే విధంగా ఒప్పందంలో చేర్చింది. దేశాల మైత్రి అనేది ఒప్పందాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండాలి. ఒప్పందాలకు కట్టుబడాలి. అప్పుడే దేశాల మధ్య మైత్రి చిగురిస్తుంది. దేశాల మధ్య దీర్ఘకాలం మైత్రి అంటే ఇండియా- రష్యాలదే. ఇప్పటికి ఈ రెండు దేశాలు తమ మైత్రిని కాపాడుకుంటున్నాయి. అలాగే చైనా అధ్యక్షుడు చేసే ఈ పర్యటన సత్పలితాలు ఇస్తే మంచిదే కానీ, బెడిసికొడితే చైనాను విశ్వంలో ఏ దేశం నమ్మదు. అప్పుడు చైనా(chaina) ప్రకటనలకు విలువే ఉండదు.'


కనుమ ఎల్లారెడ్డి

93915 23027

Also Read....

uttarandhra fight: ఉత్తరాంధ్రలో అసలేం జరుగుతోంది?

Tags:    

Similar News