భారతదేశంలో ప్రపంచీకరణ పెరిగిన తరువాత గిగ్ పని సంస్కృతి పెరిగింది. ఈ పని సంస్కృతిలో క్యాబ్ డ్రైవర్స్, జోమాటో, స్విగ్గీ, డెలివరీ బాయ్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్‌లో పనిచేసే కార్పెంటర్స్, ప్లంబర్స్ లాంటి వారు ఈ కోవకు చెందుతారు. దేశంలో ప్రస్తుతం 1.5 కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో డెలివరీ సేవలలో 99 లక్షలు ఉన్నట్లు అంచనా. 2022లో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2029 నాటికి దాదాపు 2.35 కోట్ల మంది కార్మికులు గిగ్ ఎకానమీలో పని చేయనున్నారు. భారతదేశ కార్మిక చట్టాల ప్రకారం గిగా కార్మికులు కార్మికులుగా గుర్తించబడరు. ఇది వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాలపై కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్‌పై కోడ్‌లో సూచించిన విధంగా కార్మికులకు వచ్చే అన్ని హక్కుల నుండి గిగ్ వర్కర్లు మినహాయించబడ్డారు. ఈ యూనియన్లకు అధికారికంగా గుర్తింపు ఉండదు దీంతో లేబర్ కోర్టులలో కేసులు ఉండవు. ఖచ్చితమైన పని గంటలను పర్యవేక్షిస్తారు. అవసరమైతే ఓవర్ టైం చేయాలి! విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు! పైగా వీరు తమ సేవలను తక్కువ సమయంలో అందించాలనే ఒత్తిడితో ఉన్నారు. ప్రత్యేకించి డెలివరీ వర్కర్లు, అలాగే క్యాబ్, ఆటో డ్రైవర్లు నిర్ణీత వ్యవధిలో ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తత్ఫలితంగా, వారు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. జీవనోపాధికి అభద్రత, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, సురక్షితమైన ఆదాయం లేకపోవడం గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
గిగ్ ఎకానమీలో చాలా మంది డెలివరీ కార్మికుల సగటు ఆదాయాలు సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. యాజమాన్య సంస్థలు ప్రారంభంలో అందించిన చాలా ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవడంతో ఇవి కూడా ఇటీవలి సంవత్సరాలలో పడిపోతున్నాయి. యజమాని కంపెనీ వారిని లాభదాయకం కాదని భావించినప్పుడల్లా, క్షణం నోటీసుతో వారిని ఉద్యోగాల నుండి తొలగించవచ్చు. ట్రేడ్ యూనియన్ హక్కులు కూడా వీరికి లేనందున, గిగ్ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమిష్టిగా పోరాడే స్థితిలో లేదా వారి సమస్యలకు ఏదైనా పరిష్కారాన్ని అమలు చేసే స్థితిలో లేరు. అందుకే గిగ్ వర్కర్లు మిగిలిన కార్మికవర్గంతో చేతులు కలపాలి. తమకు తాము సంఘటితం కావడానికి తమ ప్రయత్నాలలో పట్టుదలతో ఉండాలి. గిగ్ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ, తగిన ఆదాయం, సామాజిక భద్రతా ప్రయోజనాలు వంటి హక్కులను పొందడం కోసం కార్మిక సంఘాలు సమిష్టిగా కృషి చేయాలి.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752