వందశాతం మరణం రేటు ఉన్న రేబిస్ వ్యాధిని ఎదుర్కొవడమెలా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో యేటా 15 లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారు. 20 వేల మంది 'రేబిస్' వ్యాధితో చనిపోతున్నారు.

Update: 2022-09-02 18:30 GMT
వందశాతం మరణం రేటు ఉన్న రేబిస్ వ్యాధిని ఎదుర్కొవడమెలా?
  • whatsapp icon

జంతువుల నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. దీంతో పెంపుడు జంతువులను వదిలించుకునే అవకాశం లేకుండా పోతుంది. వీధి కుక్కలకు ఆహారం దొరికే చెత్తకుప్పలు లేకుండా చూడాలి. పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతమున్న వీధి కుక్కలను ఊరవతలకు తరలించాలి. కుక్కలను కొనుగోలు చేయకుండా, వీధి కుక్కలను దత్తత తీసుకోవాలి. ప్రభుత్వం వాటిని పట్టుకొని హోమ్‌లెస్ షెల్టర్స్ ఏర్పాటు చేసి అందులో ఉంచితే కావాలనుకునేవారు దత్తత తీసుకునే అవకాశముంది. ఇలాంటి పరిష్కార మార్గాలను అనుసరించి 2020లో నెదర్లాండ్స్ ప్రపంచంలో వీధి కుక్కలు లేని దేశంగా అవతరించింది. భారతదేశంలో కూడా ఇలాంటి పద్ధతులను అవలంబిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో యేటా 15 లక్షల మంది కుక్క కాటుకు గురవుతున్నారు. 20 వేల మంది 'రేబిస్' వ్యాధితో చనిపోతున్నారు. ఇందులో 40 శాతం 15 ఏళ్లలోపు వారే. ఇది ప్రపంచం మొత్తం మీద సంభవిస్తున్న రేబిస్ మరణాలలో మూడో వంతు. రేబిస్ వ్యాధి కుక్క కాటు వలన సోకుతుంది. టీకాలు తీసుకోని ఏ కుక్క నుంచైనా మనుషులకు సోకుతుంది. రేబిస్‌కు వ్యాధికి గురైన కుక్క మనుషులను కరిస్తే వ్యాధి వస్తుంది.

ఈ కుక్కలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిని కరుస్తూ ఉంటాయి. ఈ వ్యాధి ప్రబలడానికి వీధి కుక్కలు ఎక్కువగా కారణమవుతున్నాయి. రేబిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. కరోనాతో మరణించే అవకాశం 1.5 శాతం ఉండగా, అదే రేబిస్ వ్యాధితో మరణించే ప్రమాదం వంద శాతం ఉంటుంది. ఇంత ప్రమాదకర వ్యాధిని పాలకులు పట్టించుకోవడం లేదు. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

డబ్ల్యూహెచ్ఓ సూచనల ప్రకారం

నీళ్లంటే భయం, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం రావడం మొదలైనవి రేబిస్ సోకిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు. రేబిస్ సోకిన వ్యక్తి చలికి తట్టుకోలేడు, వెలుతురును చూడలేడు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ టీకా తీసుకోవడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. రేబిస్ కుక్కల కాలి గోరు కారణంగా వ్యాధి సోకుతుందని పరిశీలనలో తేలింది. ఈ వ్యాధిని అరికట్టడానికి డబ్ల్యూహెచ్ఓ కొన్ని సూచనలు చేసింది.

పెంపుడు కుక్కలకు సంతానం కలగకుండా శస్త్ర చికిత్స చేయాలి. ఎందుకంటే, పెంపుడు కుక్కల సంతానం కలిగినప్పుడు వాటిని రోడ్లపైకి వదిలేస్తారు. తరువాత అవే వీధి కుక్కలుగా మారిపోతాయి. రెండవది పెంపుడు జంతువుల నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. దీంతో పెంపుడు జంతువులను వదిలించుకునే అవకాశం లేకుండా పోతుంది. వీధి కుక్కలకు ఆహారం దొరికే చెత్తకుప్పలు లేకుండా చూడాలి. పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతమున్న వీధి కుక్కలను ఊరవతలకు తరలించాలి. కుక్కలను కొనుగోలు చేయకుండా, వీధి కుక్కలను దత్తత తీసుకోవాలి. ప్రభుత్వం వాటిని పట్టుకొని హోమ్‌లెస్ షెల్టర్స్ ఏర్పాటు చేసి అందులో ఉంచితే కావాలనుకునేవారు దత్తత తీసుకునే అవకాశముంది. ఇలాంటి పరిష్కార మార్గాలను అనుసరించి 2020లో నెదర్లాండ్స్ ప్రపంచంలో వీధి కుక్కలు లేని దేశంగా అవతరించింది. భారతదేశంలో కూడా ఇలాంటి పద్ధతులను అవలంబిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది.

 ఫిరోజ్‌ఖాన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

96404 66464

Tags:    

Similar News