పోలీసు అర్హత పరీక్షలో వారికి అన్యాయం

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రిలిమ్స్ అర్హత పరీక్షలో ఓసియేతరులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం

Update: 2022-10-11 18:30 GMT

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రిలిమ్స్ అర్హత పరీక్షలో ఓసియేతరులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులను విస్మరించింది. వివక్ష చూపడం సరికాదని తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించి న్యాయం చేయాలని మనవి. ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల నియామకాలలోని 554 ఎస్సై, 15,664 సివిల్ కానిస్టేబుల్, 614ఎక్సయిజ్ కానిస్టేబుల్, 64 ట్రాన్స్ పోర్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ అర్హత పరీక్షలో రిజర్వేషన్లు గల ఓసియేతరులైన ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం, బీసీలకు 25 శాతం, జనరల్ అభ్యర్థులకు 30 శాతం కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించిన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గల ఓసి సామాజిక వర్గాల పేదలకు ప్రిలిమినరీ అర్హత పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు తగ్గించకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో దాదాపు 30 వేల మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసే అర్హత కోల్పోయి నష్టపోతారు.

దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హులు కాగా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కులలో ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల, వీరు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ లో కనీసం 60 మార్కులు సాధిస్తేనే పరీక్షకు అర్హత సాధించే అవకాశం ఏర్పడింది. దీంతో ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నందున తక్షణం పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ పరీక్షలో రిజర్వేషన్ సౌకర్యం గల ఇతర సామాజిక వర్గాల వారికి కట్ ఆఫ్ మార్కులు తగ్గించే విధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కట్ ఆఫ్ మార్కులు తగ్గించి న్యాయం చేయాలని మనవి.

కామిడి సతీశ్‌రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి

98484 45134

Tags:    

Similar News