దేశమంతా వేడెక్కిన ఎన్నికల వాతావరణం
ఎన్నికల వేడి సెగలు కక్కుతున్న తెలుగు రాష్ట్రాలు
ఎటు చూసినా ఓట్ల లెక్కలే..
ఎన్నికల నినాదాలు మారుమోగుతున్నాయి
హామీల వర్షం కుండపోతగా కురుస్తోంది
తమకే ఓటేయాలని నాయకులు
నిజంగా ఓటెవరికి వేయాలి
తమ వ్యాపార, వ్యక్తిగత ప్రయోజనాలు
కాపాడే వారికి ఓటు అని కొందరు
నా కులం వాడికే ఓటేస్తానని ఇంకొందరు
గెలిచేవాడికే నా ఓటు అని మరికొందరు
అసలు ఓటు వేసే ప్రసక్తే లేదని
కొందరు గిరిగీసుకుంటున్నారు
ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఫిక్సయ్యారు
ఓటు ఒక అప్పగింత.. ఆ అప్పగింతను
యోగ్యులైన వారి చేతుల్లో
అప్పజెప్పాలంటోంది ఖుర్ఆన్.
‘‘ముస్లిములారా! ‘‘అమానతులను
యోగ్యులైన వారికి అప్పగించండి.
ప్రజల మధ్య తీర్పు చెప్పేటప్పుడు న్యాయంగా చేయండి’’
అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు.’’ (458)
నమ్మకద్రోహులకు కనీసం ఇంటి తాళం చెవులు
ఇవ్వడానికి కూడా మనం ససేమిరా అంటాం.
మరలాంటిది ఇంతపెద్ద దేశ వనరుల తాళం చెవుల్ని
అవినీతిపరుల, నమ్మకద్రోహుల చేతికి ఎలా అప్పగిద్దాం
ఒక్కసారి ఆలోచించండి.
ఓటు ఒక సాక్ష్యం..
విశ్వసించిన ప్రజలారా!
అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి.
న్యాయానికి సాక్షులుగా ఉండండి. (దివ్యఖుర్ఆన్ 58)
ఓటు వేసిన నాయకుడు అప్పగింతను కాపాడతాడని,
మంచి పాలన అందిస్తాడని ఓటు ద్వారా సాక్ష్యమిస్తున్నారు.
ఓటు వేయని వారు తెలుసుకోండి;
‘‘అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే
పరమ దుర్మార్గుడు ఎవడు’’ (2140)
ఓటు ఒక సిఫార్సు..
మంచి విషయం నిమిత్తం సిఫార్సు
చేసేవానికి అందులో భాగం లభిస్తుంది.
చెడు విషయం నిమిత్తం సిఫార్సు
చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. (దివ్య ఖుర్ఆన్ 485)
మీ ఓటు ద్వారా గెలిచే వారు ఎవరైనా కావచ్చు
మంచి పనులు చేసి మంచి పాలన అందిస్తే
ఆ పుణ్యకార్యాల్లో మీకూ భాగముంటుంది.
మీ ఓటు ద్వారా ఎన్నికైన వ్యక్తి
తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే
ఆ పాపంలో మీకూ వాటా ఉంటుంది.
అందుకే మన ఓటును సరైన నాయకుడికే వేద్దాం.
దేశాన్ని కాపాడుకుందాం..
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076