నీ సైన్యమంతా
నీ యోధులంతా
నీ యుద్ధ ట్యాంకులన్నీ
నీ సైనికులందరి ముందూ
రాయి పుచ్చుకుని
ధైర్యంగా నిలబడిన
ఆ బాలుడికి వ్యతిరేకంగా..
అందరూ ఒంటరిగానే...
అతని కళ్ళలో
సూర్యుడిని చూశాను..
అతని చిరునవ్వులో
చందమామను చూశాను..
ఆశ్చర్యపోయాను
నేనొక్కడినే ఆశ్చర్యపోయాను..
ఎవరు బలహీనంగా ఉన్నారు?
ఎవరు బలంగా ఉన్నారు..?
ఎవరి వైపు న్యాయం ఉంది?
ఎవరిది అన్యాయం?
నేను కోరుకుంటున్నాను
నేను మాత్రమే కోరుకుంటున్నాను
సత్యానికి నోరుండాలని
- ఘాసాన్ కనఫానీ(పాలస్తీనా కవి)
అనువాదం
రాఘవ శర్మ
94932 26180