బీజేపీ సౌత్ మార్క్ ప్లాన్...
BJP's South Mark Plan... Should Kishan Reddy appointed as BJP National President?
దేశంలో నార్త్ సౌత్ డివైడ్ ఉందని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై చాలాకాలంగా విమర్శలు సైతం ఉన్నాయి. అయితే, గతంతో పోల్చితే దక్షిణాదిన కమలనాధుల బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. సౌత్ ఇండియాకు గేటు వేగా భావించే తెలంగాణలో 8 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాదిన బలహీన పడిన లోటును దక్షిణాదిన భర్తీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
మోడీ, అమిత్ షా ద్వయం కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాలం నుంచి బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయంగా పదునైన వ్యూహాలను రచించడంలో వీరు దిట్ట అని రాజకీయ వర్గాల వాదన. ఇందుకు ఎన్నికల్లో కమలం పార్టీ విజయ పరంపర కొనసాగించడమే నిదర్శనమని పేర్కొంటారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలించి వ్యూహాలను మారుస్తుంటారని టాక్.
ఉత్తరాదిన బలహీనపడటంతో..
గతంతో పోల్చితే దక్షిణాదిన కమలనాధుల బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. సౌత్ ఇండియాకు గేటు వేగా భావించే తెలంగాణలో 8 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాదిన బలహీన పడిన లోటును దక్షిణాదిన భర్తీ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ప్రస్తుత తెలంగాణ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని నియ మించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
తెలుగు వారికి అవకాశం?
ఈ పదవికి తొలుత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును జాతీయ అధ్యక్ష పదవికి పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా మోడీ కేబినెట్‌లోకి ఆయన వెళ్లడం తో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తర్వాత నితిన్ గడ్కరీ పేరు కూడా వినబడినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో కేంద్ర అధినాయకత్వం సైతం తమకు అనువుగా ఉండే నాయకుడికే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సౌమ్యుడికి అత్యున్నత పదవి దక్కితే..
ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాదిరిగానే సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు న్న కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్ష పదవికి అర్హుడనే వాద న సైతం ఉంది. ఆయనకు పదవి లభించినట్లయితే తెలుగువాడికి.. వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్ తర్వాత మరోసారి అవకాశం దక్కినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీజేవైఎం నేతగా కిషన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న ప్రత్యేక అనుబంధం, రాజకీయాల్లో హుందాతనంగా ఉండటం, అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తగా ముం దుకు సాగడం వంటి లక్షణాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దీనికి తోడు కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గాని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గాని ఏ విధంగానూ పోటీదారు పార్టీలో కారనే అంచనాతో కిషన్ రెడ్డి ని జాతీయ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
ఢిల్లీలో తెలుగు ప్రాభవం!
కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ద్వారా బీజేపీని దక్షిణ భారతదేశంలో మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే డివిజన్ లేదని గట్టిగా చెప్పాలని కాషాయ దళం భావిస్తున్నట్టుగా తెలు స్తోంది. ఏది ఏమైనప్పటికీ కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి లభించినట్లయితే కేంద్రంలో తెలుగువారి ప్రభావం, ప్రాభవం పూర్వ స్థితికి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయని రాజకీ య పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు కేం ద్రంలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వంటి వారు ఉండి తెలుగు రాష్ట్రాలకు కావలసిన అంశా లపై గట్టిగా కొట్లాడే వారు, రాను రాను కేంద్రంలో తెలుగు నాయకుల ప్రభావం తగ్గిపోతున్న క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కె.బాపురావు
95533 07006