ప్రేమకు షరతులు వర్తిస్తాయి..
రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే సోదరుడు, సోదరి మధ్య శత్రుత్వం, సృష్టిస్తాను అన్నది నానుడి. అదే రూపాయి షర్మిల
రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే సోదరుడు, సోదరి మధ్య శత్రుత్వం, సృష్టిస్తాను అన్నది నానుడి. అదే రూపాయి షర్మిల, జగన్ మధ్య చొరబడి బంధాన్ని షేర్లు, కోట్ల రూపాయల ఆస్తులుగా తూకం వేసి చిచ్చురేపుతోంది. ఏమి జరిగిందంటే.. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం లో విభేదాల గురించి మరొకసారి చర్చ మొదలైంది. తాజాగా ఒక కంపెనీలోని వాటాల గురించి వైఎస్ జగన్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్ వేయడమే ఇందుకు కారణం.
చరిత్రలో సొంత తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి... రాజకీయంగా తనను వ్యతిరేకించినందుకు రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటానంటూ తన సోదరి షర్మిలకు జగన్ రాసిన లేఖ బయటపడింది. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించినందుకు చెల్లిపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయంటూ ఆగస్టు 27వ తేదీన షర్మిలకు లేఖాస్త్రం సంధించారు. ఆమె తన వైఖరితో బాధించినందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద షర్మిలకు రాసిచ్చిన వాటాను వెనక్కి తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.
ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాల గురించి మరొకసారి చర్చ మొదలైంది. తాజాగా ఒక కంపెనీలోని వాటాల గురించి వైఎస్ జగన్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్ వేయడమే ఇందుకు కారణం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాల బదిలీకి సంబంధించి ఎన్‌సీఎల్‌టీలో వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి పిటిషన్ వేశారు. ఇందులో వైఎస్ జగన్ పిటిషనర్–1గా, ఆయన భార్య వైఎస్ భారతి పిటిషనర్–2గా ఉన్నారు. క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పిటిషనర్–3గా ఉంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో వైఎస్ జగన్‌కు, ఆయన భార్యకు చెందిన వాటాలను ‘అక్రమంగా’ తన తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీలలో వాటాల బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జులై 26న మరో గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. 2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు.
షర్మిల వాదన ఇది..
అయితే, 2019 నాటి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు జగన్ రాసిన లేఖపై షర్మిల కూడా స్పందించారు. తండ్రి బతికున్న సమయంలో ఆయన మనుమలు, మనవరాళ్లు నలుగురికి ఆస్తుల్లో సమాన వాటాలు దక్కాలని నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. తనపై ఉన్న ప్రేమ అప్యాయతతో ఆస్తుల పంపకానికి ఒప్పుకుంటున్నట్టు ఎంఓయూలో పేర్కొనడం అర్థ సత్యమేనని షర్మిల ఆరోపించారు. భారతీ సిమెంట్స్, సాక్షి వంటి సంస్థల్లో మెజార్టీ షేర్లు జగన్ చేతిలో ఉన్నాయని, అతని ఆధిపత్యమే కొనసాగుతోందని గుర్తు చేశారు. బలం ఉందనే ఉద్దేశంతో బలవంతంగా ఎంఓయూని నిర్ణయించినట్టు ఆరోపించారు. షేర్లను తల్లి పేరిట బదిలీ చేసిన తర్వాత, గిఫ్ట్ డీడ్‌పై జగన్, బారతిలు సంతకాలు చేసిన తర్వాత వాటిపై వివాదాలు సృష్టించడం సరికాదని ఆరోపించారు.
వివాదానికి అసలు కారణం వేరే..
అయితే, జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండటమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం, ఆస్తులు, డబ్బు, ఆధిపత్యం వ్యవహారంలో జగన్ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో తలెత్తిన స్పర్థలు కూడా ఈ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. సోదరితో తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉన్నా రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రత్యర్థుల సాయంతో వివాదాన్ని సృష్టిస్తున్నారనే అపోహల్ని కొందరు జగన్‌కు కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
అన్నా చెల్లెలు బంధంలో రాజకీయం
అన్నా, చెల్లి, తల్లి మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు జగన్ చర్యలతో వైసీపీకి విస్తరించింది. కానీ అటు షర్మిల మాత్రం దీన్ని కాంగ్రెస్‌కు అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న విజయవాడలో కాంగ్రెస్ నేతలతో భేటీ నిర్వహించిన షర్మిల.. మీడియా ముందు జగన్ వ్యవహారంపై ప్రశ్నించినా ముక్తసరిగా సమాధానం ఇచ్చి సరిపెట్టారు. తాజా పరిణామాల్ని బట్టి చూస్తుం టే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్-షర్మిల వ్యవహారాన్ని కుటుంబ గొడవగానే చూస్తోందని అర్దమవుతోంది. కానీ జగన్ మాత్రం ఇందులోనూ రాజకీయం ఉందని భావిస్తున్నారు. ఆ రాజకీ యం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జాతీయ స్దాయిలో కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమిలో భాగస్వామి కావాలని కోరుకుంటున్న జగన్, ఢిల్లీలో తాను ధర్నా చేస్తే కాంగ్రెస్ రాలేదని బాధపడిన జగన్, ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో పీసీసీ ఛీఫ్‌గా ఉన్న షర్మిలను రాజకీయంగా టార్గెట్ చేస్తుండటం చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీతో సంబంధాల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. రాజీ చర్చలు జరుగుతున్నా రాజకీయంగా రాజీ పడేందుకు షర్మిల వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. ఆమె టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే ముందుగా జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని వివరిస్తున్నారు. తర్వాత టీడీపీ ప్రభు త్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన టార్గెట్‌ను ఎప్పుడూ మిస్ కానని ఆమె నేరుగా చెబుతున్నట్లవుతోంది. ఏది ఎమైనా ఇది వారిఇరువురి మధ్య వ్యవహారం దీనిపై రాజకీయం చేయటం సమన్యసమేనా ఆలోచించాల్సిన విషయం.
-శ్రీధర్ వాడవల్లి
99898 55445