తిరిగొచ్చింది నేనే...!

poem

Update: 2024-01-10 00:15 GMT

ఊపిరిసల్పని ఒత్తిడిలో

ఉదయం నుంచి సాయంత్రం దాకా

గాయి గాయిగా ఊరంతా తిరిగాను

క్షణం తీరిక లేదు

కాలు నిలిచిందీ లేదు

కొత్తగా నేర్చుకున్నదీ లేదు

పాతది మర్చిపోయిందీ లేదు

రోడ్డూ చౌరాస్తా మార్కెట్టూ

జనం జాతర...

ఎన్నో ముఖాలు ఎన్నెన్నో రూపాలు

ఎన్నో వ్యవహారాలు ఎన్నెన్నో లావాదేవీలు

ఎవరి చట్రంలో వాళ్ళు గిరగిరా

ఎవరి లోకంలో వాళ్ళు బహుపరాక్

నన్నెవరూ గుర్తుపట్టలేదు

నేనెవర్నీ పలకరించలేదు

కాళ్లరిగేలా అటు తిరిగీ ఇటు తిరిగీ

అలసి సొలసి ఆగమాగమై

ఇల్లు చేరుకున్నా

ఆదుర్దాగా నన్ను నేను

అద్దంలో చూసుకున్నా

హమ్మయ్య తిరిగొచ్చింది నేనే

మరెవరో కాదు అని

గాఢంగా నిట్టూర్పు విడిచా

- వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News