విద్యార్థులు ఫార్మా విద్య అభ్యసిస్తే మంచి ఉద్యోగం, లేదా స్వయంగా మెడికల్ షాప్ నిర్వహించుకోవచ్చనే భ్రమలో ఈ కోర్సులలో చేరుతున్నారు. కానీ ఆ విద్యార్థుల అంచనాలకు తగ్గట్టు ఆ కోర్సులలో ఉద్యోగ కల్పన జరగడం లేదు. కనీసం మెడికల్ షాప్ నిర్వహించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక చాలా మంది ఫార్మసీ కోర్సు చదివిన వారు ఆర్థిక శక్తి ఉన్న వారికి లైసెన్స్ రోజుకు కేవలం యాభై రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. పైగా షాప్ యజమానులు మందులపై ఏ అవగాహన లేని వారిని కౌంటర్ దగ్గర ఉంచి, వినియోగదారుడు అడిగిన మందుకు బదులు ఏదో మందు ఇచ్చి వెళ్ళగొడుతున్నారు. నేడు కొన్ని కార్పొరేట్ ఫ్రాంచైజ్ మెడికల్ షాప్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ వారు ఫార్మాసిస్టులను చిన్న చూపు చూస్తూ వారితో మందుల పెట్టెలు మోయించడం, లేదా షాప్ శుభ్రపరిచే పనులకు వాడుతున్నారు.
వైద్య రంగంలో ఫార్మసిస్టు పాత్ర కీలకం. రోగులకు మందులు ఇవ్వాలన్నా, వైద్యులు వ్రాసిన చిట్టి లో ఉన్న మందులు లేకపోతే మిశ్రమం కలిగిన మందులు ఇచ్చే బాధ్యత తనది. కానీ జిల్లాకో డ్రగ్ ఆఫీసర్ ఉండి కూడా మెడికల్ షాపులు, హాస్పిటల్స్ సందర్శించి, ప్రతి షాప్‌లో ఫార్మిసిస్టు ఉన్నాడా లేడా అనేది గమనించాలి. కానీ వారే పట్టించుకోకపోవడం శోచనీయం. ప్రభుత్వం జెనరిక్ మందులు వాడాలని ఎంతగా ప్రచారం చేసినా షాప్ నిర్వహకులు జెనెరిక్ మందులను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. వైద్య పరిశోధన రంగంలో ఎన్నో మార్పులు వచ్చినా ఫార్మసిస్ట్ రంగంలో మార్పు రానందువల్ల ఫార్మసీ విద్య అభ్యసించిన వారికి తగిన ప్రోత్సాహం లేక చదివిన వారికి ఉద్యోగం లేకపోవడంతో ఫార్మసీ విద్యగా మారిపోయింది.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752