Yuvagalam: అరాచక పాలనపై నారా లోకేష్ సమర శంఖం

naralokesh achivements on ycp and worked as it minister in ap

Update: 2023-01-21 18:30 GMT

గన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనపై వెన్ను చూపని పోరాటం చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం నుండి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మౌనాన్ని, నిశ్శబ్దాన్ని, బద్దలు కొట్టేందుకు, అన్యాయాన్ని, అక్రమాలను, అరాచకాన్నిఅణచివేతను, ప్రతిఘటించేందుకు బయలుదేరాయి నారా లోకేష్ రథచక్రాలు. ప్రజాసంపద దోపిడీపై నిలదీయడానికి, సమస్యలపై గళమెత్తేందుకు, వేదనకు, రోదనలకు గురవుతున్నవారికి భరోసా ఇచ్చేందుకు, ఫాసిస్టు కబంధ హస్తాల్లో బందీ అయిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించేందుకు, భూ బకాసురుల భరతం పట్టేందుకు, మానవ మృగాల నుండి మహిళలకు రక్షణ కల్పించేందుకు, దుష్పరిపాలనపై దండెత్తేందుకు పాదయాత్రగా వస్తున్న నారాలోకేష్‌కు అన్ని వర్గాల ప్రజలు కలిసి నడవాలి, నడిపించాలి.

ప్రతి అడుగు ప్రజాపక్షం వైపు వేస్తూ సమరశంఖం సాగించేందుకు ప్రజల ముందుకు వస్తున్నాడు లోకేష్. ప్రజల కష్టకాలంలో తోడై, నీడై అనుక్షణం కదం తొక్కుతూ కదలాలి. విష పాలకులకు కనువిప్పు కలిగించాలి. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నైతిక విలువలు, సామాజిక విలువలను పాతరేస్తున్న వేళ ప్రజలే ప్రభువులు. మీ ఆశీస్సులు, అభిమానం ఉంటే అవినీతి, అన్యాయం, అరాచకం, అధర్మం, అణచివేతను తరిమి కొట్టవచ్చు. నిస్వార్ధంగా జాతికోసం పని చేసే నాయకుడుగా లోకేష్ ఆబాల గోపాలాన్నిఅక్కున చేర్చుకొనేందుకు పాదయాత్ర కొత్త కోణం ఆవిష్కరింప చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చట్టాలను కాలరాసి ఇష్టానుసారం పాలన సాగిస్తున్నారు. ఈ సమయంలో జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించనప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రజలదే. పౌరులు ఓటు వేసి తమ బాధ్యత తీరినట్లుగా భావించడం వల్లనే అరాచకం, అహంకారం, స్వార్ధం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయింది. నిరంతరం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే పరిపక్వత, చైతన్యం ప్రజల్లో వుండాలి. పాలనలో ప్రజాస్వామ్య పద్దతులకు పాతరేసినప్పుడు పౌరసమాజం, మేధావి వర్గం, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించడంలో చురుగ్గా వ్యవహరించాలి. గతంలో నిరంకుశ పాలకుల దాష్టీకాలు భరించలేక, అరాచకం సహించలేక ప్రజలంతా తిరగ బడ్డారు. స్వేచ్చకోసం, సమానత్వం కోసం, హక్కుల సాధనకోసం ప్రజలంతా లోకేష్‌తో కలిసి నడవాలి.

ఆయనలో గుణాత్మక మార్పు..

ఆత్మ సంకల్పంతో సమస్యలపైనా, హక్కుల కోసం పోరాడే తత్వంలో లోకేశ్ తనను, తాను లక్ష్య సాధకుడిగా ఇప్పటికే చాటుకున్నారు. తాను అనుకొన్నది చేస్తూ విజయ తీరాల వైపు అడుగులు వేస్తున్నారు. సమర్ధవంతంగా, ధైర్యంతోనూ, పారదర్శకతతోనూ వ్యవహరిస్తున్నారు. అవే లోకేశ్ రాజకీయ ప్రస్థానానికి ఉత్తమ కొలమానం కాగలవు. తనపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతూ దీటుగా సమాధానం ఇస్తున్నారు. అధికారంతో ప్రమేయం లేకుండా ప్రజలకోసం ఎల్లవేళలా కృషి చేసేవారే నిజమైన నాయకులు అవుతారు. సమాజ అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొనే మనస్తతత్వమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఎదురు దెబ్బలు పాఠాలుగా, సంక్షోభాన్ని సానుకూల అవకాశాలుగా మార్చుకొని సైకో పాలనపై సమరం చేస్తున్నారు లోకేష్. అపారమైన పట్టుదల ప్రదర్శిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ప్రభుత్వ రౌడీయిజం, గుండాయిజానికి, బెదిరింపులకు, అణచివేతలకు దడిచేది లేదన్న తెగువను ప్రదర్శిస్తున్నారు.

లోకేశ్‌లో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది. సానుకూల దృక్పథంతో, లోపాలు దిద్దుకొని భవిష్యత్ సౌధానికి బలిష్టమైన పునాదులు వేసేందుకు లోకేష్ అవిరళ కృషి చేస్తున్నారు అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలుస్తున్నారు. కరోనా సమయంలో పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసి 80 లక్షల మంది విద్యార్థులని కాపాడిన ఘనత లోకేశ్ దే. అలాగే కరోనా సమయంలో అమెరికాలో డాక్టర్ గా పనిచేసే లోకేశ్వర రావుతో జూమ్ ద్వారా వైద్య సలహాలు అందించి తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను కాపాడారు.

వారిని కార్యోన్ముఖులను చేసేందుకు..

లోకేశ్ తెలుగుదేశం ఐటి మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ఆయన కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు చెరగని ముద్రగా ఐటీరంగ అభివృద్ధే నిదర్శనం. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో 26 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఆయనదే. రాష్ట్రంలో 2014 ముందు ఒక్క ఫోన్ కూడా ఇక్కడ తయారయ్యేది కాదు. కానీ లోకేశ్ మంత్రి అయ్యాక దేశంలో తయారవుతున్న పది సెల్‌ఫోన్లలో మూడు ఇక్కడే తయారయ్యేలా కృషి చేశారు. ఆటోమోబైల్ యూనిట్ స్థాపన కోసం దేశం మొత్తం పరిశీలించిన జపాన్ సంస్థ ఇసుజు చివరికి శ్రీ సిటిని ఎంచుకోవడం గమనార్హం. అలాగే డ్రోన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశారు. రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంది పుచ్చుకుంటూ నూతన సాంకేతిక విప్లవాన్ని పాలనలోను చూపించి ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రజల సంపద అయిన సహజ వనరుల దోపిడిలో గనుల గజనీల్లా పెట్రేగిపోతున్న అధికార పార్టీ నాయకుల దోపిడీపై, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతిసమస్య పైనా పోరాటం చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్నదాడులు, అక్రమ అరెస్టులపైనా ప్రభుత్వం సాగించిన దమన కాండపై పోరాటం చేస్తూ కార్యకర్తలకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. దళితులు, బీసీలు,మహిళలుపై అఘాయిత్యాలు, ఎస్టీలు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల పైన మాత్రమే కాదు... తెలుగుదేశం నాయకులపై కక్ష సాధింపులతో సైకో పాలన చేస్తున్న వైసీపీ నాయకులపై సమరం చేస్తున్నారు లోకేష్. రాష్ట్రంలో రాక్షసత్వాన్ని తలపించే విధానాలు గతంలో ఎన్నడూ ఎరుగం. నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసమైంది. పౌరహాక్కులను కలరాచేశారు. ప్రభుత్వ విద్వేష, విధ్వంస నిరంకుశ, అవినీతి పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమైంది. ఆర్ధికంగా దివాళా తీసింది. పాలనాపరంగా ఛిన్నాభిన్నం అయింది. భావ ప్రకటనా స్వేచ్చను కాలరాసీ రాష్ట్రంలో అరాచకానికి అశాంతికి తెరతీసారు. 2019 వరకు అభివృద్ధి పధంలో దూసుకుపోయినా రాష్ట్రాన్ని జగన్ అసమర్థ పాలనతో 30 ఏళ్ళు వెనక్కి పోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అసమర్ధులు ఆదర్శాలు వల్లెవేస్తే కార్యసాధకులు పటిష్ట వ్యూహంతో ముందుకు వెళతారు అనడానికి లోకేష్ పనితనమే అందుకు నిదర్శనం. లోకేష్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకొంటూ, ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

(23న నారా లోకేష్ జన్మదినం)

నీరుకొండ ప్రసాద్

9849625610

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News