గద్దర్ పేరిట సినీ అవార్డులా..?
సినిమా అనేది నటన, కల్పితమైన సన్నివేశాలు, ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి, నాలుగు గోడల మధ్యలో తెరమీద ప్రదర్శించేది మాత్రమే,
సినిమా అనేది కల్పితమైన సన్నివేశాలు, అలివి కానీ ఆలోచనల సమూహరం. అది నాలుగు గోడల మధ్యలో తెరమీద ప్రదర్శించేది మాత్రమే, కానీ గద్దర్ ఒక నిజం, గద్దర్ ప్రజా క్షేత్రంలో నాయ కుడు, ప్రజా గొంతుక, తెలంగాణ పోరాట వీరుడు, గద్దర్ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నిజం, నిజమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి గద్దర్. అలాంటి మహనీయుని పేరుమీద నటనల కోసం అవార్డ్స్ ఇవ్వడం తగిన ఆలోచన కాదు. తెలంగాణ సామాజిక పరిస్థితులను అన్నింటిని పరిగణనలోకి తీసుకోని మార్పులు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సినిమా అవార్డ్స్ కోసం మరో పేరును ప్రతిపాదించి అవార్డ్స్ ఇవ్వండి, గద్దర్ పేరిట ‘గద్దర్ రాష్ట్ర అవార్డ్స్’ పేరిట కొత్తగా ప్రవేశపెట్టి ప్రజాక్షేత్రంలో లేదా ప్రభుత్వ పాలనలో, నిస్వార్థమైన సేవలు అందిం చిన వారిని గుర్తించి, ఎన్నిక చేసి గద్దర్ రాష్ట్ర అవార్డ్స్‌ను ప్రతి సంవత్సరం జరుపుకునే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండో తేదీన ఇవ్వగలరు. అదే నిజమైన నాయకునికి ఇచ్చే అద్భుతమైన గౌరవం అవుతుంది. నిజమైన మహనీయుడు గద్దర్ పేరుమీద అవార్డ్స్ తీసుకునే ప్రతి ఒక్కరూ నిజమే అవుతారు. నిజ జీవిత విజేతలు అవుతారు.
డాక్టర్. వై. సంజీవ్ కుమార్,
93936 13555