ఆధునిక మహిళలు
అన్ని రంగాలలో ముందంజ!
గురజాడ మాటలను
వారు నిజం చేస్తున్నారు..!.!
గడప దాటిన యువతులు
చదువులలో రాణి స్తున్నారు .
తారకలాగ మెరుస్తున్నారు..!
ఉద్యోగాలలో ఉదయిస్తున్నారు .
ఆటలలో గెలుస్తున్నారు.
పాటల్లో పల్లవిస్తున్నారు .
కలం పట్టి ఆత్మ బలాన్ని రచిస్తున్నారు .
హలం పట్టి అన్నదాతలను మురిపించారు..!
యంత్ర వాహనాలు నడుపుతున్నారు
మంత్రులుగా ప్రమాణాలు చేస్తున్నారు.!
గగన జఘనంతో.. గగనంలోకి ఎగిరారు!
మగవారితో పోటీగా నిలిచారు!
ధరణి అంతా రమణులు విస్తరించి..
పురుష పుంగవులకు పనిలేకుండా చేశారు!
వనితలు వదిలిపెట్టిన
వంటింటి కుందేలు ఉద్యోగాన్ని
వర్క్ ఫ్రమ్ హోంలా చేసుకుంటున్నారు..!
పురుషులు అర్థ నారీశ్వరులుగా మారి..!
జి. సూర్యనారాయణ
6281725659