ఆన్‌లైన్ లోపం సరిదిద్దాలి!
రిజిస్ట్రేషన్ కోసం ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్తే, ఎల్‌ఆర్ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ

రిజిస్ట్రేషన్ కోసం ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్తే, ఎల్‌ఆర్ఎస్ ఫీజు చెల్లించినప్పటికీ ఆన్‌లైన్ మాత్రం అండర్ ప్రాసెస్ అని సైట్‌లో చూపుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులను అడిగితే సర్వర్ ప్రాబ్లం మూలంగా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎల్ఆర్ఎస్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది . ఈనెల 31 వరకు ఎల్ఆర్ఎస్‌కు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించింది. కానీ సర్వర్ ప్రాబ్లం వల్ల చివరి తేదీని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ పోర్టల్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు కూడా ఎల్ఆర్ఎస్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలి.
వావిలాల రాజశేఖర్ శర్మ,
98853 70968