డీఎస్సీకై ఎదురుచూపులు...

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీ.ఎస్సీ నిర్వహిస్తామని, అలాగే ఏప్రిల్‌లో

Update: 2025-03-29 00:30 GMT
డీఎస్సీకై ఎదురుచూపులు...
  • whatsapp icon

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ ప్రకారం ఫిబ్రవరిలో డీ.ఎస్సీ నిర్వహిస్తామని, అలాగే ఏప్రిల్‌లో టెట్ నిర్వహిస్తామని అని పేర్కొన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ రిజర్వేషన్ అంశాలు.. చర్చకు రావడంతో గత 2 నెలలుగా కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్స్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెలువర్చలేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదంతో అతి త్వరలోనే చట్ట రూపం దాల్చనున్నది. అలాగే మరో పక్క బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లనున్నది. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ఫైనల్ కావడంతో త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే 6 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన పూర్తి స్థాయి ఖాళీలు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు రెండూ జతచేసి 10 వేల టీచర్ పోస్టులకు త్వరగా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. అలాగే మోడల్ స్కూల్స్‌లోని వెయ్యి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి. కాబట్టి కాలయాపన చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ మరో టెట్ ప్రభుత్వం నిర్వహించాలనుకంటే టెట్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్స్‌కి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.

- రావుల రామ్మోహన్ రెడ్డి

93930 59998  

Tags:    

Similar News