గత డీఎస్సీ అప్లై చేసిన వారు మెగా డీఎస్సీకి అప్లై చేయాల్సిందేనా?

Update: 2025-04-22 00:45 GMT
గత డీఎస్సీ అప్లై చేసిన వారు మెగా డీఎస్సీకి అప్లై చేయాల్సిందేనా?
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు 15, 16 తో పాటు సిలబస్ వివరాలు విడుదలయ్యాయి. దీంట్లో విద్యార్హతలు, పరీక్ష నిర్వహణ, పరీక్ష విధానం, రిజర్వేషన్లు మొదలైన అంశాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలిద్దాం.

రాత పరీక్షకు 80 శాతం మార్కులు, ఏపీ టెట్ మార్కులు 20% వెయిటేజ్‌గా పరిగణిస్తారు. పరీక్షా విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా 80 మార్కులు గాను 160 ప్రశ్నలు ఇస్తారు. పీఈ‌టీ‌లకు టెట్ అవసరం లేదు కనుక 200 ప్రశ్నలకు గాను వంద మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష నిర్వహణ 2.30 గంటలు.. పీఈటీలకు మూడు గంటలుగా నిర్దేశించడం జరిగింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఇంగ్లీషులో ఉంటుంది, తరువాత అభ్యర్థి ఎంచుకున్న మాధ్యమం ఉంటుంది. SA (PE), PD, PET లకు పరీక్షలు ఇంగ్లీషులో ఉంటాయి, తరువాత తెలుగులో ఉంటాయి.

విద్యార్హతలు..

స్కూల్ అసిస్టెంట్‌ల అర్హతల్లో భాగంగా డిగ్రీలో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ బీసీలకు అయితే 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు పీజీ కలిగి మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ పూర్తి చేసినవారు కూడా అర్హులు.. వీటితో పాటు సబ్జెక్టుకు చెందిన బీఈడీలో మెథడాలజీ కలిగి ఉండాలి. ఎస్.‌జి.టి నియామకాలకు ఇంటర్మీడియట్ 50%, రిజర్వేషన్ అభ్యర్థులు 45% మార్కులు కలిగి ఉండి టీచర్ ట్రైనింగ్ కోర్స్ డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత అయ్యుండాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, దరఖాస్తు సమర్పించే సమయంలో ఆ పోస్టులకు ప్రాధాన్యతా క్రమాన్ని సూచించాలి. దీని మేరకు సెలక్షన్ జాబితాలో ఒక్క పోస్టుకు మాత్రమే ఎంపిక చేసి ఇతర పోస్టుల్లో ఎంపికైనా కూడా జాబితా నుండి పేరు తీసివేయబడుతుంది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత, అదే తుది నిర్ణయం అవుతుంది. దరఖాస్తును సవరించడానికి ఎటువంటి ఎంపికా ఉండదు.

ఆన్‌లైన్ లోనే అప్‌లోడ్

అర్హత గల ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. జనరల్ అభ్యర్థులకు కనీస వయసు 44 సంవత్సరాలు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులకు 49 సంవత్సరాలు, బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్నవారికి 54 సంవత్సరాల వరకు అనుమతి ఉంటుంది. 2024 జులై ఒకటో తేదీ నాటికి లెక్కిస్తారు. మేనేజ్మెంట్ల వారీగా సెలక్షన్ కమిటీలు ఉంటాయి. సమాన మార్కులు పొందిన అభ్యర్థుల ఇంటర్-సెక్ మెరిట్ ర్యాంక్‌ను నిర్ణయించడానికి, ప్రత్యేక క్రమ విధానాన్ని అనుసరిస్తారు. I. పుట్టిన తేదీ సీనియర్ అభ్యర్థికి చిన్న అభ్యర్థి కంటే ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది. II. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉండి, అభ్యర్థులు వేర్వేరు లింగాలకు చెందినవారైతే, మహిళా అభ్యర్థికి పురుష అభ్యర్థి కంటే ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుందని నిబంధనలు కూర్పు చేయడం జరిగింది.

చూపించాల్సిన ముఖ్య ధ్రువ పత్రాలు..

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో భాగంగా కమిటీలకు చూపించాల్సిన ముఖ్యమైన ధ్రువ పత్రాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ స్కోరు, ఒరిజినల్ కార్డ్, మార్కుల మెమో. ఒరిజినల్ అర్హత సర్టిఫికెట్లు, వయస్సు రుజువు (ఉదా. జనన ధృవీకరణ పత్రం, SSC మెమో), ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రం, పీహెచ్‌సీ సర్టిఫికెట్ లేదా దరఖాస్తులో అభ్యర్థి క్లెయిమ్ చేసిన ఏదైనా ఇతర అర్హత సర్టిఫికెట్ వీటిలో ఏవి లేకున్నా నియామకం నుండి తప్పిస్తారు. రెగ్యులర్ ప్రాతిపదికన నియమకాలు జరుగుతాయి. అప్రెంటిస్ విధానానికి స్వస్తి పలకడం జరిగింది. నియామకాలు ఒకే జాబితాతో ముగింపు పలుకుతారు. ఎటువంటి వెయిటింగ్ లిస్ట్ ఉండదు. కొత్త టీచర్లకు మూడు, నాలుగు క్యాటగిరి పాఠశాలల్లో పోస్టింగ్ వేస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు, సెకండరీ గ్రేడ్ పోస్టులకు మూడు నుంచి 8వ తరగతి వరకు సంబంధిత పాఠ్యాంశాలలో సిలబస్‌గా కంటెంట్ కింద నిర్ణయించడం జరిగింది.

ఇతరాలు..

80 శాతం ఖాళీలు లోకల్ కేటగిరీకి గాను మిగిలిన 20 శాతం ఖాళీలు నాన్ లోకల్ కేటగిరిలో భర్తీ చేస్తారు. నాన్ లోకల్ అనగా ఓపెన్ కేటగిరి కింద లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడవచ్చు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ విద్యార్హతల విషయంలో 22 సబ్జెక్టులలో రెండు కలిగి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణతై ఉండాలని సూచించడం జరిగింది. దీంతో బీకాం వారికి ప్రత్యేక ఉపశమనం కలిగించినట్లయింది. ప్రతి పోస్ట్‌కు పరీక్ష ఫీజు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ రద్దు చేసి ఉన్నందున ఆయా పోస్టులకు తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఫీజు మినహాయింపు ఇవ్వడం జరిగింది. వేరే సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకొంటే ఖచ్చితంగా పోస్టు వారి ఫీజు చెల్లించాలని నిబంధనలో తెలపడమైంది.

సి వి ప్రసాద్

రాష్ట్ర అధ్యక్షులు

ఏపీటీఎఫ్ అమరావతి

90590 76177

Tags:    

Similar News