హీరోయిన్ కోసం హీరోగా మారిన నిర్మాత

Update: 2023-02-13 15:17 GMT

రిత్రలో ఎన్నో విషాద ప్రేమకథలు ఉన్నాయి. వాటిలో రోమియో జూలియట్, సలీం అనార్కలి, దేవదాస్ పార్వతి జంటలు ఉన్నాయి. వారిలాగే బాలీవుడ్‌లోనూ ఒక విషాదకర ప్రేమకథ ఉంది. ఈ ప్రేమికుల వారోత్సవాల సమయంలో ఎన్నో ప్రేమ కథలు వింటుంటాం అలాంటి ప్రేమ కథే గురుదత్, వహీద రెహ్మాన్‌లది. గురుదత్ బాలీవుడ్ లెజెండ్ దర్శకుడు నిర్మాత, వహీదా రెహ్మాన్ తెలుగు రాష్ట్రానికి చెందిన నటి. ఆమెను చూసిన మొదటిసారే బాలీవుడ్ సినిమాలో అరగ్రేటం చేయాలనుకున్నారు. గురుదత్ అనుకున్నదే తడవుగా సీఐడీ సినిమాతో అరగ్రేటం చేయించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారు ఒకరికొకరు దగ్గరయ్యారని అప్పట్లో టాక్ వినిపించేది.

వహీదా ప్రేమించడం కంటే ముందే గురుదత్‌కి పెళ్ళి అయి కొడుకు కూడా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ అయిపోయాక తరువాత ప్యాసా అనే సినిమాకు కూడా హీరోయిన్‌గా వహీదానే కొనసాగించాడు గురుదత్. నిజానికి ఆ సినిమాకి హీరో దిలీప్ కుమార్. అయితే వహీదా హీరోయిన్ కావడంతో అప్పటిదాకా నిర్మాతగా ఉన్న గురుదత్ ఆ సినిమాతో హీరోగా అవతారమెత్తి స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. 1957లో రిలీజైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఒకానొక సమయంలో వారిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారే గుసగుసలు వినిపించాయి.

వీరిద్దరి ప్రేమ వార్తలపై గుర్రుమన్న గురుదత్ భార్య గీత తన కొడుకుతో కలిసి విడిగా జీవించడం ప్రారంభించింది. గురుదత్‌ తన భార్య కొడుకు దూరం కావడం తట్టుకోలేకపోయాడు. అతని ముందు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి తన ప్రేమను మర్చిపోయి భార్య, కొడుకుతో కలిసి ఉండటం. రెండవది మొదటి భార్యను వదిలి రెండవ భార్యగా వహీదాను పెళ్లి చేసుకోవడం. అయితే భార్య కోసం తన ప్రేమను త్యాగం చేశాడు.

అయితే వహీదాను మాత్రం మర్చిపోలేకపోయాడు. ఆమెను తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. కాలక్రమంలో సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, నిద్ర మాత్రలు తీసుకోవడం మొదలుపెట్టి తన 39 ఏళ్ళ వయసులో ఒక రోజు ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. అయితే అతని మరణానికి కారణం అతిగా నిద్ర మాత్రలు, మద్యం సేవించడమే కారణమని వైద్యులు తెలిపారు.

(ఫేస్ బుక్ సౌజన్యంతో)

ఆళవందార్ వేణుమాధవ్

8686051752

Tags:    

Similar News