న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి..!

Lawyers protection law should be brought..!

Update: 2023-12-20 23:30 GMT

దేశంలో ఉన్న వృత్తుల్లో న్యాయవాద వృత్తి కత్తిమీద సాము లాంటిది. ఈ వృత్తిలో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయవాద వృత్తికి ముఖ్యంగా వ్యవస్థలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని కేసుల్లో ప్రాతినిథ్యం ఉంటుంది. కరుడు గట్టిన నేరస్థులులకు సైతం, శిక్ష వేయించడంలో కీలక పాత్ర న్యాయవాది పోషించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి వారిపై దాడులు చేయడం హేయమైన చర్యగా భావించాల్సి ఉంది. దేశంలో రోజూరోజుకు ఎక్కడో అక్కడ నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో, తెలంగాణలో ఇద్దరు న్యాయవాద దంపతులను పబ్లిక్ చూస్తుండగా దారుణంగా చంపారు. న్యాయం కోసం పోరాడే వాళ్ళకే రక్షణ లేకుంటే మరీ సామాన్యుల పరిస్థితి ఎంటి? ఇలా చేయటం వల్ల న్యాయవ్యవస్థకి అవమానంగా చెప్పవచ్చు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2021లో న్యాయ వాదులకు రక్షణ చట్టం బిల్, వివిధ అంశాలతో రూపొందించారు, అదే ఏడాది శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలనుకున్నా, ఇంతవరకూ పెట్టలేదు. ఇప్పటికీ రెండేళ్లు గడిచినా దీనికి అతీగతీ లేదు. రాజస్థాన్ ప్రభుత్వం దేశంలోనే మొదటి సారిగా న్యాయవాదులకు రక్షణ బిల్‌ను తెచ్చి ఆమోదించింది. రాజస్థాన్ తరహాలో తెలంగాణ రాష్ట్రం న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో పెరుగుతున్న పెండింగ్ కేసులు దృష్ట్యా, న్యాయవాద వృత్తిలొ రక్షణ ఉంటే అందరికి బాగుంటుంది. అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఆర్దికంగా కనీసం మూడేళ్లపాటు సహాయం అందించడంలో చొరవ తీసుకోవాలి. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ‘లా నేస్తం’ పేరుతో ఆర్థిక సహాయం చేస్తుంది. అదే తరహాలో ఇక్కడ నూతన ప్రభుత్వం అలోచన చేయాలని కోరుకుందాం.

కిరణ్ ఫిషర్

అడ్వకేట్

79893 81219

Tags:    

Similar News