వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి!
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ గురించి చెప్పాలంటే 2020 సంవత్సరానికి ముందు ఆ తరువాత అని చెప్పుకోవచ్చు.. అంతకుముందు
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ గురించి చెప్పాలంటే 2020 సంవత్సరానికి ముందు ఆ తరువాత అని చెప్పుకోవచ్చు.. అంతకుముందు బలం గా ఉన్న రెవెన్యూ శాఖ ఆ తరువాత బలహీన పడిపోయింది. గత ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమలు చేస్తూ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయంతోనే రెవె న్యూ శాఖ పతనం మొదలు అయింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తూనే గ్రామాల్లో పనిచేసే వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు కురిపించారు. వీరిలో అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇస్తామని 55సం.రాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. అయితే, సంవత్సరాలు గడు స్తు న్నా హామీలు అమలు కాకపోవడంతో 80 రోజులు వీఆ ర్ఏలు ధర్నా చేయగా, సమ స్యలు పరిష్కరిస్తామని చెప్పి జీవో నంబర్ 81ను విడుదల చేశారు.
10 నెలలు గడిచినా..
ఈ జీవో ప్రకారం వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. కానీ వయసు55 సంవత్సరాల పైబడిన 61 ఏండ్ల లోపు ఉన్న వీఆర్ఏల వారసులకు ఉద్యో గాలు కల్పించలేదు. ఇందులో దాదాపు 2500 మంది దళితులే ఉన్నారు. దీనిపై హైకోర్టు సైతం వీరి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వీరికి ప్రమోషన్లు ఇచ్చి ఇతర శాఖల్లో పంపించడంతో గడిచిన 16 నెలల్లో నెల జీతం కూడా తీసుకోకుండానే, ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండానే 10 రోజుల్లో, నెల రోజుల్లో ఇలా ఇప్పటికే 1000 మంది రిటైర్మెంట్ అయి రోడ్డున పడ్డారు. దాదాపు 70 మంది ఈ బాధతో చనిపోయారు. చనిపోయిన వారి వారసులకు ఉద్యో గాలు ఇవ్వలేదు. మరి కొంత మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 16 నెలలుగా జీతాలు లేక తినడానికి తిండి లేక చాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చిన్నాభిన్నం అయి రోడ్డున పడ్డ వీఆర్ఏల దీన పరిస్థితి గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన 5 గురు ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. అయితే, ఆ కమిటీ వేసి 10 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో వీఆర్ఏలు దిన దిన గండంగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దలు స్పందించి వీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి.
- రొండి తిరుపతి
9573901621