పేరుకేనా ఎంబీసీ కార్పొరేషన్?
తెలంగాణ ప్రభుత్వానికి సంచార జాతి ప్రజలంటే ఎందుకు పట్టింపు లేదో అర్థం కావడం లేదు. ఎలాంటి ఆసరా లేని సంచార జాతి ప్రజల అభివృద్ధి
సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక మార్గం ఏర్పాటు చేసిందని సంతోషం కలిగింది. తమకు మంచి రోజులు వచ్చాయని వారు సంబరపడ్డారు. సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయటానికి మంచి వేదికని అనుకున్నారు. బీసీ-ఎ జాబితాలో గల అన్ని కులాలను ఈ కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటామని అధికారికంగా ప్రకటించారు. కార్పొరేషన్‌కు నాలుగేండ్ల కాలంలో బడ్జెట్‌లో ఘనంగా రూ.2,433 కోట్లు కేటాయించారు. వాటిని సక్రమంగా మాత్రం వినియోగించలేకపోయారు. సంచార జాతులకు వాటితో ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. ఎన్ని నిధులు వచ్చాయో కూడా తెలియదు. కార్యాలయ నిర్వహణ కోసమని, మరమ్మత్తుల కోసమని కోట్ల రూపాయలు గోల్‌మాల్ చేసారు.
తెలంగాణ ప్రభుత్వానికి సంచార జాతి ప్రజలంటే ఎందుకు పట్టింపు లేదో అర్థం కావడం లేదు. ఎలాంటి ఆసరా లేని సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం ప్రేమతో, సామాజిక బాధ్యతతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. దానికి రెండు సంవత్సరాలుగా చైర్మన్ లేడు. నిధులు లేవు. సంచార జాతుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని సంచార జాతి నాయకులకు మాత్రమే ఇవ్వాలి.
రాష్ట్రములో ఉన్న దాదాపు అన్ని కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థులను ఎంపిక చేసి పదవులు అప్పగించారు. కానీ, ఎంబీసీ కార్పొరేషన్‌కు మాత్రం చైర్మన్‌ను నియమించక అలాగే ఉంచారు. గతంలో సంచార జాతికి చెందనివారిని చైర్మన్ చేసి సంచార జాతుల ఆత్మ గౌరవాన్ని అవమాన పరిచారు. ఆ చైర్మన్ మూడేండ్లు సంచార జాతులకు తీరని అన్యాయం చేశారు. నిధులు దుర్వినియోగం చేశారు. సంచార జాతులను పట్టించుకోలేదు. ఈ విషయాలన్నింటినీ లేఖ ద్వారా సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలూ లేవు. ఎంబీసీ కార్పొరేషన్‌కు చైర్మన్ లేక రెండు సంత్సరాలు గడిచాయి.
వివరాలు కూడా లేవు
సంచారజాతి కులాల బతుకులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వారి పూర్తి వివరాలు. బతుకుల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు కూడా తెలువకపోవడం విచారకరం.సంచార జాతి ప్రజలు ఎక్కడ ఉంటారో? ఏం చేస్తారో? వారి జీవన విధానం ఎలాంటిదో? తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం ఎంత అన్యాయమైన విషయమో గమనించవచ్చు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పని ఏంటి? అంటే ఏమి లేదు.
ఘనమైన ప్రచారం చేసింది. ఆ స్థాయిలోనే గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వందల కోట్లు నిధులు ప్రకటించింది. నిజమే అనే భ్రమను కల్పించింది. సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక మార్గం ఏర్పాటు చేసిందని సంతోషం కలిగింది. తమకు మంచి రోజులు వచ్చాయని వారు సంబరపడ్డారు. సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయటానికి మంచి వేదికని అనుకున్నారు. బీసీ-ఎ జాబితాలో గల అన్ని కులాలను ఈ కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటామని అధికారికంగా ప్రకటించారు. కార్పొరేషన్‌కు నాలుగేండ్ల కాలంలో బడ్జెట్‌లో ఘనంగా రూ.2,433 కోట్లు కేటాయించారు. వాటిని సక్రమంగా మాత్రం వినియోగించలేకపోయారు. సంచార జాతులకు వాటితో ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. ఎన్ని నిధులు వచ్చాయో కూడా తెలియదు. కార్యాలయ నిర్వహణ కోసమని, మరమ్మత్తుల కోసమని కోట్ల రూపాయలు గోల్‌మాల్ చేసారు.
అష్టకష్టాల బతుకులు
ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 35 కులాలకు చెందిన 1,02,812 కుటుంబాలు, 3,65,456, జనాభా ఉన్నట్లు ఎంబీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నివేదిక ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1,419 మందికి మాత్రమే 50 వేల రూపాయల చొప్పున గ్రాంట్‌గా 7.95 కోట్లు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. పని లేక, సంచారం చేయలేక, ఆదుకునేవారు లేక అష్టకష్టాలు పడి చాలా మంది ఈ జాతి ప్రజలు చనిపోతున్నారు.
కొందరు అడుక్కోవడం వృత్తిగా ఎంచుకొని బతుకుతున్నారు.ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక సంచార జీవితం గడుపుతూ, దినమొక ఊరు తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చీకటి పడితే అక్కడే డేరా వేసుకొని, రోడ్డు పక్కన, మురికి కాలువల పక్కన, చెత్త కుప్పల పక్కన, చిన్నిచిన్ని చెట్ల పొదల దగ్గర, మోరి పైపులలో తలదాచుకుంటున్నారు. సంచార జాతి ప్రజలు కూడా మనుషులేనని గుర్తించాలి. నేరుగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలి. సంచార జాతి నాయకులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలి.
శ్రీనివాస్ తిపిరిశెట్టి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం
99494 26536