మెడికల్ గైడ్:బైపోలార్ మానసిక రుగ్మత

మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్ డిజార్డర్. బై పొలార్ రుగ్మత ఉన్న వ్యక్తులు ఉవ్వెత్తున లేస్తారు.

Update: 2022-03-29 18:30 GMT

మద్యపానం లేదా వినోద ఔషధాలను ఉపయోగించడం మానేయాలి. సానుకూల ప్రభావం చూపే వ్యక్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మానసిక స్థితి మార్పుల హెచ్చరిక సంకేతాలను చూడడంలో సహాయపడగలరు. నిద్రపోవడం, తినడం, శారీరక శ్రమ కోసం ఒక సాధారణ దినచర్యను కలిగి ఉండటం ద్వారా మానసిక స్థితిని సమతుల్యం చేసుకోగలుగుతారు. మూడ్ చార్ట్ ను తయారు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి కావల్సిన యోగా, ధ్యానం రోజూ చేయాలి.

మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్ డిజార్డర్. బై పొలార్ రుగ్మత ఉన్న వ్యక్తులు ఉవ్వెత్తున లేస్తారు. ధబేల్‌మని కిందపడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం, అంతలోనే ఉత్పాతం. కెరటం అంత బలంగా ఉన్నారు అనుకుంటాం. అంతలోనే అంతకంటే ఎక్కువగా బలహీనపడిపోతారు. రూపాయి నాణేన్ని టేబుల్‌ మీద తిప్పితే ఒకసారి బొమ్మ, ఒకసారి బొరుసు కనిపించినట్టే వీళ్లలో సంతోషం, విచారం స్వల్ప వ్యవధిలోనే కనిపిస్తూ ఉంటాయి. ఇదో షాకింగ్ డిజార్టర్. అరుదైనది మాత్రం కాదు.

బైపోలార్ డిజార్డర్ మానసిక అనారోగ్యం. బైపోలార్ డిజార్డర్‌ను గతంలో 'మానిక్ డిప్రెషన్' అనేవారు. ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారికి వస్తూ ఉంటుంది. లేదంటే, ప్రేమించిన వాళ్లు దూరమైనా, అయినవాళ్లు చనిపోయినా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నా, మత్తుపదార్థాలకు బానిసైనా సదరు వ్యక్తులు బైపోలార్ డిజార్డర్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. బైపోలార్‌ వ్యాధి అంటే ఒక మనిషిలో రెండు రకాల పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. మానియా, డిప్రెషన్‌ రెండు రకాల లక్షణాలు ఉంటాయి. మానియ దశలో మితిమీరిన సంతోషం, ఆత్మవిశ్వాసం, అతిగా గొప్పలు చెప్పడం, నృత్యం చేయడం, పాటలు పాడడం, అతిగా సెక్స్‌ కోరికలు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తారు. డిప్రెషన్‌ దశలో తీవ్ర మానసిక బాధ, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఏ పనిపైనా స్పష్టత లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం, పూర్తిగా నిరాశకు లోనవుతారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా, మానసిక ఒత్తిడితో వస్తుంది.

ప్రేమ, శ్రద్ధ మరవొద్దు

బైపోలార్ డిజార్డర్ బాధితుల పట్ల ఎక్కువ శ్రద్ధ, ప్రేమ చూపాల్సిన అవసరం ఉంది. ఈ రుగ్మత ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు తమ తప్పులను తెలుసుకుంటారు. రుగ్మత ఉన్న వారిని ప్రశాంతంగా ఉండనివ్వాలి. అలసిపోకుండా జాగ్రత్త పడాలి. పదిమందితో కలిసేలా చూడాలి. ఆ వ్యక్తి మనోభావాలు కొన్ని సందర్భాలలో విచిత్రంగా ఉండవచ్చు, ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను గుర్తుంచుకోండి అస్సలు వదిలివేయవద్దు. బైపోలార్ డిజార్డర్ అనేది జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితి అయినప్పటికీ, చికిత్స ప్రణాళికను క్రమ పద్ధతిలో నిర్వహించడం ద్వారా మానసిక కల్లోలాన్ని తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలా వరకు బైపోలార్ డిజార్డర్‌ను మందులు, సైకోలాజికల్ కౌన్సెలింగ్ (సైకోథెరపీ)తో నయం చేయడానికి అవకాశం ఉంది.

ఇంటర్ పర్సనల్, సోషల్ రిథమ్ థెరపీ నిద్ర ఆహార సమయాలను ఒక క్రమ పద్దతిలో నిర్వహించడం ద్వారా మూడ్ మేనేజ్‌మెంట్‌ను సరిచేయడం జరుగుతుంది. బైపోలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్ర, ఆహారం, వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. 'కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ తో మానసిక ఆలోచనలు, మేధో చిత్రాలను మార్చడం, వ్యక్తి భావోద్వేగాలు, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేస్తుంది. అన్ని ఆలోచనలను క్రమబద్ధీకరించడం ద్వారా ఫలితం సానుకూలంగా ఉంటుంది.

మానసిక విద్య

బైపోలార్ డిజార్డర్ (సైకో ఎడ్యుకేషన్) మానసిక విద్య గురించి నేర్చుకోవడం ద్వారా స్నేహితుల పరిస్థితిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మానసిక సమస్యలను గుర్తించడం వాటి పట్ల అవగాహన పొందడం వలన ఉత్తమ చికిత్సను పొందడంలో సహాయపడుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు పూర్తి స్థాయిలో బై పొలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తికి సమయానుగుణంగా ప్రణాళిక బద్దంగా అందించాలి. మానసిక కల్లోలం హెచ్చరిక సంకేతాలను సరైన సమయంలో గుర్తించి సైకాలజిస్టుల సహకారం లేదా సైకియాట్రిస్టులను సంప్రదించాలి.

బైపోలార్ డిజార్డర్‌ను మరింత తీవ్రతరం చేసే జీవనశైలిలో మార్పులను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. బైపోలార్ డిజార్డర్‌తో ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటి రిస్క్-టేకింగ్ ప్రవర్తన, డ్రగ్స్ లేదా ఆల్కహాల్ దుర్వినియోగం ప్రతికూల పరిణామాలు. మద్యపానం లేదా వినోద ఔషధాలను ఉపయోగించడం మానేయాలి. సానుకూల ప్రభావం చూపే వ్యక్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మానసిక స్థితి మార్పుల హెచ్చరిక సంకేతాలను చూడడంలో సహాయపడగలరు. నిద్రపోవడం, తినడం, శారీరక శ్రమ కోసం ఒక సాధారణ దినచర్యను కలిగి ఉండటం ద్వారా మానసిక స్థితిని సమతుల్యం చేసుకోగలుగుతారు. మూడ్ చార్ట్ ను తయారు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి కావాలసిన యోగా, ధ్యానం రోజూ చేయాలి.

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి

సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్

97039 35321

Tags:    

Similar News