సంబరాలు వద్దు.. సవాళ్లు వద్దు!
ప్రజల పన్నుల సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. అప్పుడే ప్రజలకు
ప్రజల పన్నుల సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం కలుగుతుంది. దేశభక్తి, క్రమశిక్షణ పెరిగి తమ తమ పనులు చేసుకుంటూ దేశ ప్రగతికి బాటలు వేస్తారు. ఒక రాజ్యం రాజు మరొక రాజ్యం రాజుపై యుద్ధం చేసి గెలిచినప్పుడు కక్ష సాధింపు ధోరణి రాజుపై ఉంటుంది. కానీ ప్రజలపై ఉండేది కాదు. అది రాజనీతి. అధికార కాంక్ష రక్తపాతంతో అధికార మార్పిడి జరిగింది. ఆనాడు ప్రజలు అమాయకులు, నిమిత్తమాత్రులు.
ప్రజాస్వామ్యంలో పాలకులను ఎన్నుకోవడంలో ప్రజలే కీలకం. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి జరిగిన తరువాత పాలకులకు ప్రజలందరూ సమానం. అధికారపక్షం, ప్రతిపక్షాల మధ్య సవాలు విసురుకోవడం, సంబరాలు చేసుకోవడం పరిపాటైంది. శాంతియుతమైన పాలనతోనే అభివృద్ధి జరుగుతుంది. దానితో పేదరికం కనుమరుగవు తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ జీవి తాలను మెరుగుపరచుకోవడానికి మంచి పాల కులను ఎన్నుకుంటారు. గెలిచిన నాయకులు ప్రజలు తమకు తాముగా ఉన్నతంగా జీవించడానికి మంచి మార్గాలను అన్వేషించాలి. సంస్కరణలు చేయాలి.
నల్లధనం ఖాతాలోకి రాలే కానీ...
గతంలో మన ప్రధాని మోడీ నల్లధనాన్ని తెచ్చి ప్రజల అకౌంట్‌లో జమచేస్తానని అన్నారు. నల్లధనం అయితే అకౌంట్‌లోకి రాలేదు కానీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకా రం చేసారు. ఇక మన కె. చంద్రశేఖర్ రావు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎక్కువ అభివృద్ధి చేసినా, ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎన్నికల్లో డబ్బులు పంచినా ప్రజలు ఎవరిని గెలిపించా లనుకున్నారో వాళ్లనే కొద్ది మెజారిటీతోనైనా గెలిపించారు.
ప్రజలు అన్నీ గమనిస్తారు..
అభివృద్ధి, సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడపడం ఒక ఛాలెంజ్ అని ప్రతిపక్షాలకు తెలుసు, అయినా ఇంకా అధికార దాహం తీరక ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా ప్రజలు గమనిస్తు న్నారన్న విషయం నాయకులు గమనించాలి. ప్రతిపక్షాలు ఏదైనా సద్విమర్శ చేసి సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. ఇ చ్చిన గడువు లోపల రుణమాఫీ చేస్తే రిజైన్ చేస్తానని సవాల్ విసరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మీ విలువ చూసే ఓట్లేస్తారు...
పాలనలో అవినీతికి తావు లేకుండా నిజమైన ప్రజాస్వామ్య పాలనకు విలువను ఇచ్చినప్పుడు ప్రజలు మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టకున్నా మిమ్ములను గెలిపిస్తారు. మిమ్ములను మీరు నిరూపించుకొని ప్రజలలోకి రండి. పిల్లి పాలు తాగుతున్నప్పుడు ఇతరులు గమనించడం లేదని అనుకుంటుంది. అదేవిధంగా నాయకు లు పాలనలో జరిగే తప్పు ఒప్పు నిర్ణయాలను పనితీరును ప్రజలు గమనించడం లేదని అనుకుంటారు. కానీ వారిని మభ్యపెట్టలేరు. ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలను తమ ఇంటిలో నుంచి ఇస్తున్నట్లుగా తమ పేర్లను పెట్టుకొని అడ్రెస్ లేకుండా అవుతున్నారు. ఇది గమ నించాలి. పాలనలో నిరాడంబరత అవసరం. రాజకీయ నాయకులకు మంత్రులకు ప్రజలతో మాట్లాడే విధానం, చట్టసభలలో మాట్లాడే విధానం, ఓపికగా వినే విధానం, పాలన గురిం చి, మన చట్టాల గురించి తెలుసుకోవడానికి శిక్షణ ఇవ్వాలి. ఇటు నాయకులు సైతం తమ పొలిటికల్ పొజిషన్ గురించి ఆలోచించకుండా ప్రజల బాగు గురించి ఆలోచించాలి.
సోమ శ్రీనివాసరెడ్డి
కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్